Pawan Kalyan : ఎలక్షన్స్ తర్వాతే సినిమాలు.. పవన్ నిర్ణయంపై వాళ్ల మైండ్ బ్లాక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ ఎలక్షన్స్ కి రెడీ అవుతున్నారు. ఈసారి టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేన అధినేత ఆ ప్రకారం

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Shock To His Movie Directors And Producers

Pawan Kalyan Shock To His Movie Directors And Producers

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ ఎలక్షన్స్ కి రెడీ అవుతున్నారు. ఈసారి టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేన అధినేత ఆ ప్రకారం తన పార్టీ కార్యచరణలు చేస్తున్నారు. ఇదిలాఉంటే పవన్ తో సినిమా చేసే నిర్మాతలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓజీ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి చేయాలని అనుకున్నారు కానీ అది జరిగేలా లేదు.

మరోపక్క హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా షూటింగ్ వాయిదా పడింది. క్రిష్ డైరెక్షన్ లో ప్లాన్ చేసిన హరి హర వీరమల్లు కూడా ఇంకా షూటింగ్ చేయాల్సింది చాలా ఉంది. అయితే ఈ సినిమాలన్నిటినీ ఎలక్షన్స్ తర్వాతే మళ్లీ సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. ఎలక్షన్స్ అయ్యే వరకు నో షూటింగ్స్ అని దర్శక నిర్మాతలకు చెప్పాడట.

పవన్ తో సినిమా కోసమని బడ్జెట్ కేటాయించిన నిర్మాతలకు ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. ఏపీలో ఎలక్షన్స్ అంటే నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే. పవన్ తీసుకున్న ఈ డెశిషన్ కు నిర్మాతలు షాక్ అవుతున్నారు. దాదాపు ఆరు నెలల పాటు బ్రేక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుండగా ఈ సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు ఏమి చేయలేని పరిస్థితి కనబడుతుంది.

పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు ఈ సినిమాలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

Also Read : EVV – Boyapati : ఆ విషయంలో ఈవీవీని కాపీ కొడుతున్న బోయపాటి..

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 18 Nov 2023, 09:12 PM IST