Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పొలిటికల్ ప్రచారాల పనిలో ఉన్నారు. ఈక్రమంలోనే ఏపీలో పలు మీటింగ్స్ పెడుతూ కాంపెయిన్ చేస్తూ వస్తున్నారు. ఇక పవన్ వస్తున్నాడంటే.. ఆ చుట్టూ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, పవన్ తో ఒక ఫోటో దిగడానికి ఫ్యాన్స్ తెగ సంబరపడుతుంటారు. అయితే ఫ్యాన్స్ చూపే ఈ అభిమానంతో పవన్ కళ్యాణ్ కి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
వీరి అభిమానంతో పవన్ చాలాసార్లు గాయాలు పాలయ్యారు. ఇక ఇప్పుడు ఈ అభిమానుల మధ్య కొందరు కిరాయిమూకలు వచ్చి సన్న బ్లేడ్ తో పవన్ సెక్యూరిటీ సిబ్బంది పై, పవన్ పై దాడి చేస్తున్నారట. ఈ విషయాన్ని పవన్ స్వయంగా తెలియజేసారు. రీసెంట్ మీటింగ్ లో పవన్ మాట్లాడుతూ.. “నేను రోజుకి రెండు వందల మందికి ఫోటోలు ఇస్తుంటాను. అందరికి ఫోటోలు ఇవ్వాలని ఉంటుంది. కానీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. ఈమధ్య కొందరు కిరాయిమూకలు సన్న బ్లేడ్లతో దాడి చేస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు స్టార్ట్ చేసారు. వీరమల్లు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంటే, ఓజి 70 శాతం, ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం ఐదు శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఏపీ ఎన్నికలు అయ్యేవరకు ఈ సినిమా షూటింగ్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వవు. ముందుగా ఓజి షూటింగ్ ని పూర్తి చేయనున్నారు. పవన్ ఇంకొక షెడ్యూల్ లో పాల్గొంటే సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి అవుతుందట. ఆ తరువాత వీరమల్లు, ఉస్తాద్ షూటింగ్స్ ని ఒకే సమయంలో తెరకెక్కించుకుంటూ ముందుకు తీసుకు వెళ్లనున్నారు.
Also read : Jabardasth Mohan: ఘనంగా జబర్దస్త్ కమెడియన్ మోహన్ పెళ్లి వేడుక.. నెట్టింట ఫోటోస్ వైరల్?
ఫొటోస్ ఇద్దామంటే కొంత మంది సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కోస్తున్నారు: పవన్ కళ్యాణ్ #TDPJanasenaBJP pic.twitter.com/D2uJMKLkBp
— M9 NEWS (@M9News_) April 1, 2024