Site icon HashtagU Telugu

Pawan Kalyan : ప్రశాంతత కోసం పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చూస్తారో తెలుసా..?

Pawan Kalyan Said He Watch Horror Films To Calm His Mind

Pawan Kalyan Said He Watch Horror Films To Calm His Mind

Pawan Kalyan : జనసేన ప్రచారంలో ఉన్న పవన్ కళ్యాణ్.. ఆంధ్రరాష్ట్రం వ్యాప్తంగా కాంపెయిన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ కాంపెయిన్ మధ్యలోనే పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా ఓ ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్ కి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో ఓ రాపిడ్ ఫైర్ క్వశ్చన్ గేమ్ ఆడారు. ఈక్రమంలోనే ఈరోజు రాత్రికి ఓ సినిమా చూడాలంటే.. మీరు ఏ సినిమా చూస్తారు అని ప్రశ్నించారు.

ఇక దీనికి పవన్ కళ్యాణ్ బదులిస్తూ.. ‘హారర్ సినిమా చూస్తాను’ అని చెప్పుకొచ్చారు. హారర్ ఫిలిమ్స్ ఎందుకు చూస్తారు అని ప్రశ్నించగా, పవన్ బదులిస్తూ.. “ఆ సినిమాలు చూస్తే నా మైండ్ సైలెంట్ అయ్యి ప్రశాంతత దొరుకుతుంది. బయట నిజ జీవితంలో కనిపించే డెవిల్స్ కంటే.. హారర్ సినిమాల్లో వచ్చే డెవిల్స్ ని చూడడానికి ఇష్టపడతాను” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ఈ రాపిడ్ ఫైర్ లో తన ఫేవరెట్ సాంగ్ ని కూడా పాడి అదుర్స్ అనిపించారు. ‘ఏ రాతే ఏ మౌసమ్’ అనే హిందీ సూపర్ హిట్ సాంగ్ ని పవన్ పాడి వావ్ అనిపించారు. కాగా గతంలో ఈ పాటని పవన్ వారసురాలు ఆద్య కూడా ఓ స్టేజి పాడింది. దీంతో తండ్రి కూతుళ్లు ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు అంటూ.. ఆ రెండు వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు.

కేవలం ఈ ఇంటర్వ్యూలోనే కాదు కాంపెయిన్ లో కూడా పవన్ పాటలు పాడుతూ జనసైనికులను ఉత్సాహపరుస్తున్నారు. రీసెంట్ కాంపెయిన్ లో రామ్ చరణ్ మగధీర సినిమాలోని ఓ పాటలోని బిట్ ని పాడి జనసైనికుల్లో జోష్ ని నింపారు. ఆ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.