Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ నటించిన సినిమాల్లో సగం రీమేక్ లే.. ఆ చిత్రాలు ఏంటో తెలుసా?

Pawan Kalyan Remake Movies List

Pawan Kalyan Remake Movies List

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా ఇప్పటివరకు 25 సినిమాల్లో నటించాడు. రెండు చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం పవన్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తీసిన సినిమాల్లో సగం చిత్రాలు రీమేక్(Remake) లే. పవన్ ఫస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’.. అమీర్ ఖాన్ నటించిన హిందీ సినిమా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’కి రీమేక్ గా తెరకెక్కింది. ఇక తన రెండో సినిమా ‘గోకులంలో సీత’.. తమిళ్ మూవీ ‘గోకులతిల్ సీతై’కి రీమేక్ గా వచ్చింది.

మూడో సినిమా ‘సుస్వాగతం’.. తమిళ హీరో విజయ్ నటించిన ‘లవ్ టుడే’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఆ తర్వాత తొలిప్రేమ వంటి స్ట్రైట్ స్టోరీతో వచ్చిన పవన్ బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా యూత్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఆ నెక్స్ట్ వచ్చిన తమ్ముడు రీమేక్ చిత్రం కాకపోయినా హిందీ సినిమా ‘జో జీతా వహి సికిందర్’కి ఇన్స్పిరేషన్ గా తరికెక్కింది. ఆ సినిమాలో అమీర్ ఖాన్ హీరో. ఇక పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఖుషీ సినిమా రీమేక్ అని చెప్పినప్పటికీ.. అది స్ట్రైట్ మూవీనే అని దర్శకుడు SJ సూర్య చెబుతుంటాడు.

ఖుషీ చిత్రాన్ని ముందుగా తెలుగులోనే తీయాల్సింది కానీ పవన్ డేట్స్ కుదరకపోవడంతో ముందుగా తమిళంలో విజయ్ తో తీసినట్లు దర్శకుడు చాలాసార్లు చెప్పుకోవచ్చాడు. ఇక 2006లో వచ్చిన ‘అన్నవరం’ సినిమా.. తమిళ మూవీ ‘తిరుప్పాచి’కి, 2011లో వచ్చిన ‘తీన్ మార్’.. హిందీ సినిమా ‘ లవ్ ఆజ్ కల్’కి రీమిక్స్ గా వచ్చాయి. ఆ తరువాత 2012లో సల్మాన్ ఖాన్ నటించిన హిందీ మూవీ ‘దబాంగ్’కి రీమేక్ గా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే.

2015లో పవన్ కళ్యాణ్ వెంకటేష్ తో కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘గోపాల గోపాల’. ఈ సినిమా బాలీవుడ్ మూవీ ‘ఓ మై గాడ్’కి రీమేక్ గా తెరకెక్కింది. ‘కాటమరాయుడు’ చిత్రం తమిళ సినిమా ‘వీరం’కి రీమేక్ గా వచ్చింది. ఇక సినిమాలు మానేసి రాజకీయంలోకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. కమ్ బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ చిత్రం బాలీవుడ్ ‘పింక్’ మూవీకి రీమేక్. ఆ తర్వాత ఇటీవల వచ్చిన ‘బీమ్లా నాయక్’ మలయాళం మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి రీమేక్.

ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమా కూడా తమిళ్ చిత్రం ‘వినోదయ సితం’కి రీమేక్ గా వస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరకు నటించిన, నటిస్తున్న రీమేక్ చిత్రాల మొత్తం సంఖ్య 13. ఈ రీమేక్ చిత్రాల్లో పవన్ సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది.

 

Also Read : Ram Charan : చిన్ననాటి స్నేహితుడు, ప్రభాస్ పార్ట్నర్ తో కలిసి రామ్ చరణ్ కొత్త నిర్మాణ సంస్థ.. వాళ్లకు ఛాన్సులు ఇవ్వడానికే..

Exit mobile version