Site icon HashtagU Telugu

Khushi 2 : ఖుషి 2 రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే..?

Pawan Kalyan Rejected Sj Surya Khushi 2

Pawan Kalyan Rejected Sj Surya Khushi 2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఖుషి. తమిళ రీమేక్ సినిమానే అయినా ఖుషి సినిమాకు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్టింగ్ భూమిక క్యూట్ నెస్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టాయి. రిలీజైన ఒకటి రెండు రోజులు మామూలు టాక్ తెచ్చుకున్నా సరే ఆ తర్వా ఆ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ చొక్కాలు చించుకున్నారు. యూత్ ఆడియన్స్ అంతా మెచ్చిన సినిమాగా ఖుషి సెన్సేషనల్ హిట్ అందుకుంది.

ఐతే ఎస్ జె సూర్య ఆ తర్వాత నటుడిగా మారి వరుస సినిమాలు చేస్తున్నారు. ఐతే ఈమధ్య తెలుగులో కూడా ఆయన సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. లేటెస్ట్ గా నాని సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా నటించారు ఎస్ జె సూర్య. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడికి వెళ్లినా సరే ఖుషి 2 సినిమా గురించి అడుగుతున్నారు. ఐతే రీసెంట్ ఇంటర్వ్యూలో సూర్య ఖుషి 2 (Khushi 2) విషయాన్ని చెప్పారు.

ఖుషి 2 కథ రాసుకుని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దగ్గరకు వెళ్లానని. కథ నచ్చినా ఇప్పుడు తాను ప్రేమకథలు చేయడం కరెక్ట్ కాదని చెప్పారని పవర్ స్టార్ ఒప్పుకుని ఉంటే ఖుషి 2 చేసే వాడినని అన్నారు ఎస్ జె సూర్య. ఖుషి 2 పవన్ వద్దన్నాడు కాబట్టి ఆయన తనయుడు అకిరా నందన్ తో ఖుషి 2 చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు ఏపీ డిప్యూటీ సీఎం గా ఉంటూనే మరోపక్క సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ 3 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.