Site icon HashtagU Telugu

Pawan Kalyan : బాబాయ్‌తో అబ్బాయి ఫోటోలు చూసారా.. కాలికి గాయంతో పవన్..

Pawan Kalyan Ram Charan Photos Videos At Pithapuram (1)

Pawan Kalyan Ram Charan Photos Videos At Pithapuram (1)

Pawan Kalyan : బాబాయ్ పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపేందుకు అబ్బాయి రామ్ చరణ్.. నేడు పిఠాపురం పర్యటనకి వెళ్లిన సంగతి తెలిసిందే. తన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్ తో కలిసి రామ్ చరణ్ ఈరోజు ఉదయం పిఠాపురంకి వచ్చారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవాలని పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామ్ చరణ్, సురేఖ, అల్లు అరవింద్.. అనంతరం పిఠాపురంలోని పవన్ ఇంటికి వెళ్లారు.

అక్కడ పవన్ కి కలుసుకొని తనకి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇక బాబాయ్, అబ్బాయి ఒకే చోటకి చేరుకునేపాటికి.. వారిద్దర్నీ చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. పవన్ నివాసం వద్దకి చేరుకొని జై జై నినాదాలతో సందడి చేసారు. ఇక తమ కోసం వచ్చిన అభిమానులను నిరుత్సాహపరచకుండా.. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ బయటకి వచ్చి అభిమానులకు అభివాదం చేసి ఉత్సాహపరిచారు. చరణ్ చెయ్యి పట్టుకొని పవన్ కళ్యాణ్ జనసైనికులకు పరిచయం చేస్తున్న విజువల్స్.. అందర్నీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చరణ్ రాకతో పవన్ మొహంలో ఎంతో సంతోషం కనిపిస్తుంది.

ఇక ఈ మీటింగ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈక్రమంలోనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఒక ఫొటోలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కలిసి కనిపిస్తున్నారు. ఆ ఫొటోలో పవన్ కళ్యాణ్ కాలుకి ఒక చిన్న గాయం కూడా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కుడి కాలు బొటన వేలికి చిన్న కట్టు కట్టి కనిపిస్తుంది. అది గమనించిన జనసైనికులు పవన్ కాలుకి ఏమైందని కంగారు పడుతున్నారు.