Site icon HashtagU Telugu

OG vs Game Changer : బాక్సాఫీస్ దగ్గర బాబాయ్ అబ్బాయ్ ఫైట్.. ఎవరు తగ్గుతారో..?

Pawan Kalyan Ram Charan Box Office Fight Og Vs Game Changer

Pawan Kalyan Ram Charan Box Office Fight Og Vs Game Changer

OG vs Game Changer పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమా డివివి దానయ్య నిర్మాణంలో వస్తుంది. అయితే ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ లక చేశారు. సెప్టెంబర్ చివరి వారం నుంచి  అక్టోబర్ గాంధి జయంతి వరకు ఉన్న సెలవులను టార్గెట్ చేస్తూ ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఆ టైం లోనే రాం చరణ్ గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అనుకున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

గేమ్ చేంజర్ ని అసలైతే సమ్మర్ లో రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశారు. కానీ శంకర్ డైరెక్షన్ లో సినిమా మొదలు పెట్టడమే కానీ ఎప్పుడు పూర్తి చేయాలన్నది ఆయన చేతుల్లోనే ఉంటుంది. నిర్మాతలకు కూడా ఈ సినిమా మీద ఎలాంటి క్లారిటీ ఉండదు. అందుకే దిల్ రాజు కూడా గేం చేంజర్ ని సమ్మర్ నుంచి పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్ లాస్ట్ వీక్ రిలీజ్ అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ టైం లో పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుండటం తో గేమ్ చేంజర్ టీం కి షాక్ తగిలింది. బాబాయ్ తో అబ్బాయ్ డైరెక్ట్ ఫైట్ ఎప్పుడు జరగలేదు. రెండు సినిమాలు బాగుండాలంటే అలా ఒకే డేట్ కి రాకుండా ఉంటేనే బెటర్ అని భావిస్తున్నారు.

సెప్టెంబర్ చివరి వారం ఓజీ రావడం కన్ఫర్మ్ అయితే మాత్రం గేం చేంజర్ ని అక్టోబర్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బాబాయ్ అబ్బాయ్ బాక్సాఫీస్ ఫైట్ ఉంటుందా.. ఒకవేళ పవన్ సినిమా వచ్చినా గేమ్ చేంజర్ ని దిల్ రాజు రేసులో దించుతాడా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read : Pawan Kalyan : నాలుగేళ్ల హరి హర.. అయినా ముందుకు కదలదా..?