Site icon HashtagU Telugu

KBC 16 : కౌన్ బనేనా కరోడ్ పతి షో లో పవన్ కు సంబదించిన ప్రశ్న..

Pawan Kalyan Question Kaun

Pawan Kalyan Question Kaun

Pawan Kalyan question that made contestant win Rs 1.6L : కౌన్ బనేనా కరోడ్ పతి (Kaun Banega Crorepati)..ఈ షో గురించి తెలియని వారు ఉండరు..దీనిని ప్రేరణ గా తీసుకొని తెలుగు మీలో ఎవరు కోటీశ్వరులు అనే ప్రోగ్రాం కూడా టెలికాస్ట్ అయ్యింది. ప్రస్తుతం హిందీ లో కౌన్ బనేనా కరోడ్ పతి సీజన్ 16 నడుస్తుంది. బిగ్ బి అమిత్ బ్ (Amitabh Bachchan) హోస్ట్ గా వ్యవరిస్తున్న ఈ షో లో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు సంబదించిన ప్రశ్నను బిగ్ బి అడిగారు.

‘2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం (AP Deputy CM)గా బాధ్యతలు చేపట్టిన నటుడు ఎవరు?’ అని ప్రశ్న వేశారు. ఈ ప్ర‌శ్న‌లు నాలుగు ఆప్ష‌న్లు కూడా ఇచ్చారు. అందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవి, నాగార్జున‌, బాలకృష్ణ అనే ఆప్ష‌న్లు ఇచ్చారు. అయితే, ఆ దంప‌తులు ఈ క్వ‌శ్చ‌న్ కోసం లైఫ్‌లైన్ ఉప‌యోగించుకున్నారు. ఈ ప్రశ్నకు వారు ఆడియన్స్ పోల్‍ను ఎంపిక చేసుకున్నారు. అయితే, ఆడియెన్స్ లో 50శాతానికిపైగా పవన్ కల్యాణ్ అని పోల్ చేశారు. దీంతో వారు కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆప్షన్‌ను లాక్ చేశారు. దీంతో రూ.1,60,000 ప్రశ్నను వారు దాటారు.

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత… బిగ్ బి పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలు చెప్పారు. “జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ నూతన ఉప ముఖ్యమంత్రిగా బాధత్యలు తీసుకున్నారు. ఆయన మంచి నటుడు. చిరంజీవి చిన్న తమ్ముడే ఈ పవన్ కల్యాణ్” అంటూ హాట్ సీట్ లోని వారితో పాటు ఆడియెన్స్ కు చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ క్వ‌శ్చ‌న్‌కు సంబంధించిన వీడియో కాస్త నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

ఇక పవన్ కళ్యాణ్ విషయం చెప్పాల్సిన పనిలేదు..పవర్ స్టార్ అంటేనే ఒక బ్రాండ్. సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా ఆయనకంటూ ఒక రికార్డ్ ఉంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దాదాపు పదేళ్లు గా రాజకీయాల్లో ఉన్నప్పటికీ విజయం మాత్రం ఇప్పుడు వరించింది. ఆ విజయం కూడా మామూలుది కాదు..బరిలోకి దిగిన 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి ఓ రికార్డు నెలకొల్పారు. ఎన్నికల విజయం తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం గా పదవిని చేపట్టారు.

ఇక బిగ్ బి విషయానికి వస్తే.. రీసెంట్​గా కల్కి 2898 ఏడీ చిత్రంలో అశ్వత్థామగా అద్భుతమైన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మన్స్​తో మెప్పించారు. అయితే అమితాబ్​ కేవలం బిగ్ స్క్రీన్​పై మాత్రమే కాకుండా బుల్లితెర ఫై హోస్ట్​గా ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ చేస్తున్నాడు.

Read Also : Legality To Hydra : ‘హైడ్రా’కు చట్టబద్ధత.. వచ్చే నెలలోనే ఆర్డినెన్స్ : రంగనాథ్‌