Site icon HashtagU Telugu

Pawan Kalyan : పరిటాల రవి, పవన్ మధ్య ఏం జరిగింది.. అసలు గొడవ స్థలం గురించా..?

Pawan Kalyan Paritala Ravindra Issue Complete Details

Pawan Kalyan Paritala Ravindra Issue Complete Details

Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటినుంచో ఒక రూమర్.. అలా ఓ ప్రశ్నగా మారిపోయింది. ఆ రూమరే ప్రముఖ దివంగత రాజకీయవేత్త పరిటాల రవి, పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టించారని. పవన్ అండ్ పరిటాల మధ్య ఏదో వివాదం చోటు చేసుకుందని, ఈ గొడవతో పరిటాల రవి, పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టించారని ఇప్పటికీ పలువురు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయానికి ఎటువంటి ఆధారాలు లేవు. పరిటాల కుటుంబం కూడా ఈ వార్తలో నిజం లేదని చాలాసార్లు చెప్పుకొచ్చారు.

మరి అసలు ఈ వార్త ఎలా పుట్టుకొచ్చింది..? ఒక రూమర్ పుట్టడానికి కూడా ఏదో ఒక కనెక్షన్ ఉండాలి కదా. కానీ ఇక్కడ చూస్తే ఆ సమయంలో పవన్ సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగే స్టేజిలో ఉన్నారు. పరిటాల రవి అప్పటి రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఉన్నారు. వీరిద్దరికి ఎక్కడ కనెక్షన్ కనబడడం లేదు. మరి ఈ రూమర్ ఎలా వచ్చింది..? అనేది ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ చిల్లగట్టు శ్రీకాంత్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అసలు విషయం ఏంటంటే.. 1997 సమయంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పరిటాల ఇంటి పక్క ఉన్న 500 గజాల స్థలాన్ని ప్రముఖ నటుడు జగ్గయ్య నుంచి చిరంజీవి కొనుగోలు చేశారట. అయితే ఈ కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్ పూర్తి అయ్యింది గాని, రిజిస్ట్రేషన్ పూర్తి అవ్వలేదు. ఇక ఆ సమయంలో పరిటాల రవి పై బాంబు దాడి జరిగింది. దీంతో తన భద్రత కోసం.. తన ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని తానే కొనుగోలు చేయాలని భావించారు.

అయితే అప్పటికే ఆ స్థలం చిరంజీవి కొనుగోలు చేసారని తెలియడంతో.. పరిటాల, చిరు మధ్య స్థలం కోసం కొన్ని చర్చలు జరిగాయి. ఇక ఈ చర్చలు గురించి పూర్తి వివరాలు తెలియని నెల్లూరుకి చెందిన ఓ వార్తాపత్రిక.. ఒక తప్పుడు వార్తని ప్రచురించింది. చిరు, పరిటాల మధ్య జరిగిన చర్చల్లో పవన్ ఆవేశానికి లోనయ్యాడని, దానికి పరిటాల రియాక్ట్ అవుతూ పవన్ కి గుండు కొట్టించారని వార్తలు రాసుకొచ్చారు.

కేవలం ఈ వార్త మాత్రమే కాదు. ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని.. పలు తప్పుడు వార్తలను ప్రచురిస్తూ వచ్చింది. ఆ సమయంలో చిరంజీవి ఈ వార్తాపత్రిక పై లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నారట. ఇది అసలు జరిగిన విషయం. ఈ మొత్తం విషయంలో చర్చలు జరిగింది చిరు, పరిటాల మధ్య మాత్రమే. పవన్ కళ్యాణ్ కి ఈ విషయానికి అసలు సంబంధం లేదట.