సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ (Allu Arjun Arrest) కావడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ పై చాలామందే స్పందించారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు పై దాడి ఘటనపై ఆయనను పరామర్శించేందుకు వచ్చారు.
పరామర్శ అనంతరం అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడాగా.. కొంత మంది అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ ను ప్రశ్నించారు . దీనిపై ఆయన మాట్లాడుతూ..ఇది సంబంధలేని ప్రశ్నఅని అన్నారు. ఇక్కడ మనుషులు చనిపోతే.. సినిమాల గురించి ప్రస్తావించడం ఏంటి అని కాస్త ఫైర్ అయ్యారు. ఈ సమస్య కంటే పెద్ద సమస్యలు చాలానే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలని మీడియా కు పవన్ కళ్యాణ్ సూచించారు.
తాజాగా మీడియా చిట్ చాట్ లో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఫై స్పందించారు. ‘గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి. మానవతా దృక్పథం లోపించినట్లెంది. బన్నీనే కాదు. టీమ్ అయినా స్పందించాల్సింది. CM రేవంత్ పేరు చెప్పలేదని అరెస్ట్ చేశారనడం సరికాదు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే చేస్తారు’ అని చెప్పుకొచ్చారు.
అలాగే రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. కిందిస్థాయి నుంచి ఎదిగిన గొప్ప వ్యక్తి అని , వైసీపీ తరహాలో సీఎం రేవంత్ ఎక్కడ వ్యవహరించలేదన్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు అవకాశం ఇచ్చారు. అల్లు అర్జున్ విషయంలో ముందూ వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుంది. కాకపోతే ఈ ఘటనలో హీరోను ఒంటరిని చేసినట్లు నాకు అనిపించింది. ఇందులో పోలీసుల తీరును కూడా తప్పుబట్టను, కావాలని ఎవరో చేసింది కాదు..అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం అని అని మీడియా చిట్ చాట్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also : Melbourne Test: జైస్వాల్ విషయంలో థర్డ్ అంపైర్ చీటింగ్