Site icon HashtagU Telugu

Pawan Kalyan OG: భారీ ట్విస్ట్ ఇచ్చిన సుజీత్.. రెండు భాగాలుగా పవన్ కళ్యాణ్ ఓజీ..?!

Pawan Kalyan OG

Pawan Kalyan started They Call Him OG Movie Shooting in Mumbai

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్ బాయ్ సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓజీ (OG). ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ చిత్రంగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాల్లో, ఇటు వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓజీ మూవీకి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్ కనిపించనున్నారు. ముంబై, జపాన్ నేపథ్యంలో సినిమా సాగనుందని సమాచారం అందుతుంది. ఈ ఓజీ మూవీ ఇప్పటికే 50 శాతం షూటింగ్ జరుపుకున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఓజీ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ రెండు భాగాలుగా (OG Two Parts) ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు చిత్ర నిర్మాతతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోవడంతో ఓజీ పార్ట్ 2 కూడా ఉంటుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ స్ట్రైట్ మూవీ చేయాలని ఫ్యాన్స్ ఆశపడుతుండగా వాళ్ళ అంచనాలకు మించి ఓజీని డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ టూ పార్ట్స్ ఆ కాదా అన్నది మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Also Read: Sreeleela : రష్మిక ప్లేస్ లో శ్రీలీల..డైరెక్టర్ సెంటిమెంట్ కు బ్రేక్

ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య ఓజీ చిత్ర నిర్మాతగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఓజీ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కావచ్చని అంటున్నారు. ఓజీతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మేకర్స్ సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హరి హర వీరమల్లు మూవీపై ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ లేదు.