OG – Mirai : యువ హీరో తేజ సజ్జ తన స్క్రిప్ట్ సెలక్షన్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నారు. ఇప్పటికే ‘హనుమాన్’ మూవీతో అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈ హీరో.. తన కొత్త సినిమాతో మరోసారి ఆశ్చర్యానికి గురి చేసారు. ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ తన నెక్స్ట్ మూవీని చేయబోతున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసి సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి నేడు టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.
ఈ సినిమాకి ‘మిరాయ్’ అనే టైటిల్ ని పెట్టారు. తేజ సజ్జ ఈ సినిమాలో ఓ అపార గ్రంథాన్ని కాపాడే యోధుడిగా కనిపించబోతున్నారు. ఈక్రమంలోనే చేతిలో కత్తి, లాంగ్ హెయిర్ తో యోధుడిగా, మోడరన్ ఏజ్ సమురాయ్ గా కనిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తుంటే.. ఓజి సినిమాలోని పవన్ కళ్యాణ్ లుక్ గుర్తు వస్తుంది. సమురాయ్ లా కత్తిసాము చేస్తున్న పవన్ లుక్స్ గతంలో బయటకి వచ్చి నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ఆడియన్స్ మాత్రమే కాదు, తేజ సజ్జ కూడా తన లుక్స్ ని ఓజి మూవీలో పవన్ లుక్స్ తో కంపేర్ చేసుకుంటున్నారు. నేడు జరిగిన గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో తేజ సజ్జని ప్రశ్నిస్తూ.. ‘సూపర్ యోధా టైటిల్ ని టాలీవుడ్ లోని ఓ హీరోకి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు?’ అని ప్రశ్నించారు. దీనికి తేజ బదులిస్తూ.. “పవన్ కళ్యాణ్ గారికి ఈ టైటిల్ ని ఇస్తాను” అని చెప్పుకొచ్చారు.
ఓజి సినిమాలోని పవన్ లుక్స్.. యోధా లుక్స్ కి బాగా సెట్ అవుతాయి. ఆ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్, ఈ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ కూడా సేమ్ ఉంటుంది.. అంటూ మిరాయ్ మూవీతో ఓజిని పోలుస్తూ తేజ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా రిలీజైన మిరాయ్ టైటిల్ గ్లింప్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
SuperHero @tejasajja123 says Power Star @PawanKalyan is a SUPER YODHA🥷🏻#PawanKalyan #TejaSajja #OG #Mirai pic.twitter.com/arlMtJGbgV
— Naveen Sana (@sanapowerstar) April 18, 2024