Site icon HashtagU Telugu

OG – Game Changer : ఓజి, గేమ్ ఛేంజర్ రిలీజ్.. అబ్బాయి కోసం బాబాయ్ వెనక్కి తగ్గుతున్నాడా..?

Pawan Kalyan Og Ram Charan Game Changer Release Date Updates

Pawan Kalyan Og Ram Charan Game Changer Release Date Updates

OG – Game Changer : ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో టాలీవుడ్ బడా సినిమాల సందడి గట్టిగా ఉండబోతుంది. నెలకి ఒక బడా హీరో సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఆగష్టులో అల్లు అర్జున్, సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్, అక్టోబర్ లో ఎన్టీఆర్, డిసెంబర్ లో నాగచైతన్య బడా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ తెలుగు సినిమాలతో పాటు కొన్ని తమిళ బడా హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇక వీటన్నిటి మధ్య రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే ఇప్పటికే ఈ చిత్రాలన్నీ డేట్స్ అనౌన్స్ చేసుకొని ఉండడంతో గేమ్ ఛేంజర్ రిలీజ్ కి సరైన తేదీ కనిపించడం లేదు. దీంతో ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. ఈ సినిమా ఈ రిలీజ్‌లు మధ్య తీసుకు రావాలంటే, ఉన్నదీ ఒకటే ఛాన్స్ అది.. దీవాళీ పండుగ. అయితే ఆ పండక్కి ముందు వెనుక సినిమాలు ఉండడం.. గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ కి దెబ్బ పడేలా కనిపిస్తుంది. దీంతో గేమ్ ఛేంజర్ రిలీజ్ పెద్ద సమస్యగా మారింది. అయితే అబ్బాయి సమస్య చూసిన బాబాయ్.. తన సినిమాని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది.

సెప్టెంబర్ లో రావాల్సిన ఓజి మూవీ షూటింగ్ ఇంకా కొంత బ్యాలన్స్ ఉంది. ఏపీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత పవన్ షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తీ చేసినా.. ఈ మూవీ రిలీజ్ కావడానికి ఒక ఇబ్బంది కనిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో కొంచెం ఆలస్యం జరిగే అవకాశం ఉందట. దీంతో ఈ చిత్రం ఈ ఏడాది నుంచి పోస్టుపోన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఓజి వెనక్కి తగ్గితే గేమ్ ఛేంజర్ కి మంచి అవకాశం వచ్చినట్లు అవుతుంది.

మరి ఓజి వాయిదా పది గేమ్ ఛేంజర్ కి అవకాశం ఇస్తాడా లేదా చూడాలి. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ని పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. ప్రెజెంట్ లాస్ట్ స్టేజి షూటింగ్ జారుతున్నట్లు సమాచారం.