Pawan Kalyan OG పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ఓజీ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా విషయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఓజీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ తోనే సినిమాపై ఒక రేంజ్ అంచనాలు పెంచాడు డైరెక్టర్ సుజిత్. అసలైతే సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఆ డేట్ కి దేవర వచ్చింది.
పవన్ కొద్దిరోజులు టైం ఇస్తే షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ చూస్తున్నారు. ఓజీ సినిమా సెట్స్ మీద ఉండగానే బిజినెస్ అదరగొట్టేస్తుంది. సినిమా (OG Business) బిజినెస్ లో పవర్ స్టార్ రేంజ్ తెలిసేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 150 కోట్ల దాకా పలికాయని టాక్. ఓజీ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న కారణంగా సినిమాకు నార్త్ సైడ్ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్ లో జరుగుతుంది.
OG బిజినెస్ విషయంలో..
ఓజీ సినిమా బిజినెస్ విషయంలో దూకుడు చూపిస్తుంది. ఇప్పటికే ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఓజీ సినిమా విషయంలో మేకర్స్ అంతా భారీ ప్లానింగ్ తో ఉన్నారు. పవర్ స్టార్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
సాహో తర్వాత సుజిత్ చాలా గ్యాప్ తర్వాత ఓజీ చేస్తున్నాడు. ఐతే టీజర్ కట్ చూస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఓజీ పవర్ స్టార్ Pawan Kalyan స్టామినా చూపించేలా ఓజీ విధ్వంసం ఉంటుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Rukmini Vasanth : ఎన్టీఆర్ తో లక్కీ ఛాన్స్ పట్టేసిన ముద్దుగుమ్మ..!