నాని నటించిన ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ వేడుకకు నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నానికి తన ఇంట్లో కూడా అభిమానులు ఉన్నారని, తన సినిమాలను కుటుంబ ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. “నానిని నేను ఎంతో గౌరవిస్తాను. అతను తీసుకునే నిర్ణయాలపై ఆయనకు గట్టి నమ్మకం ఉంది. అతను ప్రతిభావంతుడైన నటుడు కూడా. మా ఇంట్లో కూడా అతనికి అభిమానులున్నారు. నిజానికి మా సోదరి అతని నాని సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతుంది” అని పవన్ వ్యాఖ్యానించారు. నాని, నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ‘అంటే సుందరానికి’ టీమ్ మొత్తానికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan: మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాని అభిమానులే!
నాని నటించిన 'అంటే సుందరానికి' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

Nani
Last Updated: 10 Jun 2022, 03:37 PM IST