Site icon HashtagU Telugu

Pawan Kalyan Health : వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్

pawan kalyan is suffering from viral fever

pawan kalyan is suffering from viral fever

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. దీంతో రేపు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన జనసేన విస్తతస్ధాయి భేటీ వాయిదా పడింది. గత కొద్దీ రోజులుగా పవన్ కళ్యాణ్ ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా వరుస రాజకీయ సమావేశాలు , వారాహి యాత్ర (Varahi Yatra) లతో పాటు సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ వస్తుండడం తో ఆయన అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ను పరీక్షించిన డాక్టర్స్ వారం రోజుల పాటు రిస్ట్ తీసుకోవాలని సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్రకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి (Varun Tej Lavanya Tripathi Marriage) నేపథ్యంలో.. పవన్ యాత్రకు లాంగ్ బ్రేక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో.. పవన్ తన ఫ్యామిలీతో కలిసి అక్టోబర్ 17న ఫారిన్‌కు పయనం కానున్నట్టు తెలుస్తోంది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత మళ్లీ 26న తిరిగి రానున్నట్టు సమాచారం. కాగా.. ఫారిన్‌కు వెళ్లే ముందే.. పార్టీ కార్యక్రమాలు అన్ని చక్కబెట్టాలని బిజీ షెడ్యూల్ వేసుకున్న పవన్‌కు.. సడెన్‌గా వైరల్ ఫీవర్ రావటంతో.. అన్ని కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది.

Read Also : Actor Nasser : ప్రముఖ నటుడు నాజర్ ఇంట విషాదం ..