Renu Desai on Pawan: పవన్ డబ్బు మనిషి కాదు.. ఆయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి: రేణుదేశాయ్

పవన్ కల్యాణ్ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, డబ్బు మనిషి కాదని మాజీ సతీమణి రేణూ దేశాయ్ అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Renu Desai

Renu Desai

పవన్ కల్యాణ్ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, డబ్బు మనిషి కాదని… ఆయన మాజీ సతీమణి రేణూ దేశాయ్ అన్నారు. పవన్ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. ఈ మేరకు ఆమె ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. పవన్ పై రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇకనైనా వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాలని తాను వీడియోతో ముందుకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు.

వ్యక్తిగతంగా తనకు పవన్ పై కోపం ఉన్నప్పటికీ… దాన్ని పక్కనపెట్టి, రాజకీయంగా సపోర్ట్ చేస్తానని ప్రకటించింది. రాజకీయంగా ఆయనకు ఓ అవకాశం ఇవ్వాలని అందర్నీ కోరుతోంది. “ఆయన సక్సెస్ ఫుల్ హీరో. కావాలంటే సినిమాల్లో కొనసాగవచ్చు. కావాల్సినంత క్రేజ్, డబ్బు వస్తుంది. కానీ ఆయన రాజకీయాలు ఎంచుకున్నాడు. కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కనపెట్టాడు. ఆయన దగ్గర నేను లేకపోయినా, ఆయన్ను గమనిస్తూనే ఉన్నాను. ఆయన రాజకీయంగా నిజాయితీగా ఉన్నారు. చెప్పడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ చెబుతున్నాను, ఆయనకు ఓ అవకాశం ఇవ్వండి. నేను ఆయన మాజీ భార్యగా చెప్పడం లేదు, సమాజానికి చెందిన ఓ పౌరురాలిగా చెబుతున్నాను.” అంటూ రియాక్ట్ అయ్యింది.

పవన్ వ్యక్తిగత జీవితం పై సినిమా తీస్తామని వైసిపి నేతలు హెచ్చరించారు కూడా. దీనిపైన కూడా రేణు దేశాయ్ స్పందించారు. బ్రో సినిమా వివాదం గురించి నాకు తెలియదు. కానీ పవన్ వ్యక్తిగత జీవితం పై సినిమాలు తీస్తామని కొందరు ప్రకటించారు. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. పరిస్థితులు ఏవైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి అని రేణు దేశాయ్ కోరారు. ప్రస్తుతం రేణు వీడియో పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది.

Also Read: Mahesh Babu: మహేశ్ బాబు ఆల్ టైం రికార్డ్, కోట్లు కొల్లగొట్టిన ‘బిజినెస్ మేన్’

  Last Updated: 10 Aug 2023, 06:04 PM IST