Site icon HashtagU Telugu

Pawan and Sai Dharam Tej: పవన్ మావయ్యే నా గురువు, మా ఇద్దరిది గురుశిష్యుల బంధం: సాయితేజ్

Sai Tej

Sai Tej

మెగా హీరోల్లో ఒకరైన సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇటీవల విడుదలైన విరూపాక్ష మూవీ సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ సహ రచయిత. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్లను క్రాస్ చేసిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన పార్ట్2 కూడా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీలో సాయి ధరమ్ తేజ్ కు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పట్ల ప్రత్యేకమైన గౌరవం. అభిమానం కూడా. పవన్ కళ్యాణ్ మేనల్లుడు అయిన సాయితేజ్ కు మంచి సపోర్ట్ ఉంది. ముఖ్యంగా పవన్ నుంచి ఆర్థికపరంగానూ మద్దతు ఉంది. త్వరలోనే వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియా ముందుకొచ్చిన సాయితేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”  నాకు పవన్ కళ్యాణ్ గారు గురువు (Teacher) లాంటివారు. మా ఇద్దరి మధ్య గురుశిష్యుల బంధం ఉంది. జీవితంలో (Life) ఎన్నో విషయాలు నేర్పించాడు. కష్టాలు ఎదురైనప్పుడు ఎలా ఉండాలో, వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పాడు. చివరకు అమ్మాయిలను ఎలా గౌరవించాలో పవన్ మావయ్య నుంచే నేర్చుకున్నా’’ అని సాయి తేజ్ చెప్పాడు.

కాగా సాయితేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సమయంలోనూ పవన్ అండగా నిలిచారు. ఎప్పటికప్పుడు సాయితేజ్ ఆరోగ్యంపై డాక్టర్లతో మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నాడు. ఇక సాయితేజ్ కెరీర్ కూడా వీక్ గా ఉన్న సమయంలో కూడా సాయితేజ్ తో కలిసి నటించేందుకు ముందుకొచ్చాడు. విరూపాక్ష తో హిట్ కొట్టిన సాయితేజ్ త్వరలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్నారు. ఇప్పటి  ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. త్రివిక్రమ్ (Trivikram) ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన సంయుక్త  పలు టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ బ్యూటీ త్రివిక్రమ్ సినిమాలో కూడా నటిస్తోందని సమాచారం.

Also Read: 31 Killed: శాంతించని మణిపూర్.. మొత్తం 31 మంది మృతి!