Site icon HashtagU Telugu

Pawan Kalyan: మెగా హీరోల‌కు క‌లిసిరాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ఒక బ్రాండ్‌. గ‌తేడాది ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి 164 స్థానాలు గెలుపొంద‌డంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కీలక పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. అయితే ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ప‌వ‌న్ రేంజ్ మ‌రో స్థాయికి వెళ్లిపోయారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కూడా ప‌వ‌న్ అంటే ఓ రెస్పెక్ట్ ఏర్ప‌డింది. అయితే ప‌వ‌న్ ఏదీ ప‌ట్టినా బంగార‌మే అయింది. ఆయ‌న ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ స్థానాల్లో విజ‌యం సాధించారు.

అయితే సినిమాల్లోకి వ‌చ్చేస‌రికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ఐర‌న్ లెగ్ అయ్యారు. ప‌వ‌న్ తాను న‌టించిన సినిమాల్లో కాకుండా ఇత‌ర సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో కొంద‌రు సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్‌ను టాలీవుడ్ ఐర‌న్ లెగ్ అని అంటున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న లెక్క‌ల ప్ర‌కారం అయితే ఇందులో రెండు మెగా ఫ్యామిలీ సినిమాలకే ప‌వ‌న్ ఐర‌న్ లెగ్‌గా మారారు. అయితే ప‌వ‌న్ అటెండ్ అయిన మూడు సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్ అయ్యాయి. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం బోల్తా పడ్డాయి. వాటిలో మొద‌టి సినిమా సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ సినిమా. ఈ సినిమా షూటింగ్ అనంత‌రం ప‌వ‌న్ ముద్దుల మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్ కావ‌డంతో ఈ సినిమా బాధ్య‌త‌ల‌ను ప‌వ‌న్ త‌న భుజాల‌పై వేసుకున్నాడు. అంతేకాకుండా రిప‌బ్లిక్ మూవీ నిర్వ‌హించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సాయి తేజ్ బ‌దులు ప‌వ‌న్ అటెండ్ అయి అప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మ‌న‌ల్ని ఎవ‌డ్రా ఆపేది అనే డైలాగ్ ఈ ఈవెంట్‌లో చెప్పిందే. అయితే ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

Also Read: Worlds Smartest Pen : న్యూవా పెన్.. పెన్నులో కూడా ఇన్ని ఫీచర్లా ?!

ఆ త‌ర్వాత ప‌వ‌న్ ఐర‌న్ లెగ్ అని నిరూపించిన మ‌రో సినిమా అంటే సుంద‌రానికి మూవీ. ఈ మూవీలో నేచుర‌ల్ స్టార్ నాని క‌థ‌నాయకుడిగా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీ ఈవెంట్‌కి కూడా ప‌వ‌న్ ముఖ్య అతిథిగా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. సినిమా బాగుంద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. తాజాగా ప‌వ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ మూవీ కోసం ప‌వ‌న్ ముఖ్యఅతిథిగా వ‌చ్చారు. అయితే ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని రితీలో మిశ్ర‌మ టాక్‌ను సొంతం చేసుకుంది.