Site icon HashtagU Telugu

Game Changer : పవన్ పొలిటికల్ కారు సీన్‌ని.. ‘గేమ్ ఛేంజర్’లో కాపీ కొట్టేస్తున్న చరణ్..

Pawan Kalyan Ippatam Car Sequence Reference In Ram Charan Game Changer

Pawan Kalyan Ippatam Car Sequence Reference In Ram Charan Game Changer

Game Changer : రామ్ చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్స్ గా తమిళ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గత మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ఈ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో మూవీలోని చరణ్ టాకీ పార్ట్ అంతా పూర్తీ అవుతుందట.

కాగా వైజాగ్ లో జరుగుతుంది అవుట్ డోర్ షూటింగ్ కావడంతో.. అభిమానులు చిత్రీకరణ చూసేందుకు సెట్స్ వద్దకి చేరుకొని సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే పలు వీడియోలు, ఫోటోలు కూడా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఒక కారు సీక్వెన్స్ ని కూడా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇక ఈ సీక్వెన్స్ ని పవన్ పొలిటికల్ కారు సీన్‌తో అభిమానులు పోల్చుతున్నారు.

‘ఇప్పటం’ గ్రామ ప్రజల ఇళ్ల కూల్చివేత సమయంలో పవన్ కళ్యాణ్.. మంగళగిరి తన పార్టీ ఆఫీస్ నుంచి కారు టాప్ పై కూర్చొని అగ్రెసివ్ గా ఇప్పటం చేరుకున్న సంగతి అందరికి తెలిసిందే. సినిమా రేంజ్ లో జరిగిన ఆ కారు సీక్వెన్స్ సీన్.. నేషనల్ వైడ్ వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆ సీన్ ని రిఫరెన్స్ గా తీసుకోని దర్శకుడు శంకర్.. రామ్ చరణ్ తో ఓ సీన్ తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు.

అయితే ఈ సీన్ లో రామ్ చరణ్.. కారు టాప్ పై కాకుండా, కారు ముందు భాగంలో ఇంజిన్ పై కూర్చొని కనిపిస్తున్నారు. ఈ సీన్ కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్ లోనే తెరకెక్కిస్తుండడంతో.. పవన్ పొలిటికల్ సీన్ కి ఈ సీన్ కి ఏమైనా పోలికలు ఉంటాయా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీకి సంబంధించిన కొన్ని సీన్స్.. ఈ సినిమాలో కనిపించబోతున్నాయంటూ వార్తలు వినిపించాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే.. మూవీ రిలీజ్ వరకు ఆగలేసిందే.