Pawan Kalyan: ‘పవన్’ ని ‘హరిహర వీరమల్లు’ లో అన్ని గెటప్పుల్లో చూస్తామా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మాత ఏ.ఎం రత్నం ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Hariharaveeramallu

Hariharaveeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మాత ఏ.ఎం రత్నం ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే తొలిసారి నటిస్తున్న పీరియాడిక్ మూవీ ఇది. రాబిన్హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ ను చాలా పవర్ ఫుల్ గా క్రిష్ చూపించబోతున్నారు అని టాక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్ స్టన్నింగ్ లుక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసినా భారీ సెట్స్ లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా నటిస్తున్నారు అనేది నిర్ధారణ అయింది. కాబట్టి కథ పరంగా పవన్ ఎప్పటి కప్పుడు వేషధారణ మార్చుకోవాల్సి ఉంది. దీని కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు 30 వేషధారణలలో ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక గెటప్ ని ఫస్ట్ లుక్ రూపంలో విడుదల చేశారు. ఇక మిగిలిన లుక్స్ ఎలా ఉంటాయనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో నెలకొంది. పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడు కాబట్టి అన్ని గెటప్పులు సహజమే అంటున్నారు ఆయన అభిమానులు.

ఇకపోతే ‘హరిహర వీరమల్లు’ లో దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్), పవన్ ని కనీవినీ ఎరుగని రీతిలో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నట్లు టాక్. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నేతృత్వంలో 1000 మందితో పవన్ చేసిన పోరాట ఘట్టాలను అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలిసింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ‘హరిహర వీరమల్లు’ పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందరి అంచనాలను మించే విధంగా దర్శకుడు క్రిష్ ఈ సినిమాపై అత్యంత శ్రద్ధతో పని చేస్తున్నారు.

  Last Updated: 19 Apr 2022, 12:05 AM IST