Pawan Kalyan : చరణ్ ఫై పవన్ ప్రశంసలు కురిపిస్తూ బర్త్ డే విషెష్

‘ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

Published By: HashtagU Telugu Desk
Pawan Wishesh Charan

Pawan Wishesh Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే (Birthday) ఈరోజు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు , అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan)..చరణ్ ఫై ప్రశంసలు కురిపిస్తూ..విషెష్ తెలియజేసాడు.

‘ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్.. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞుల పట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే అతడికి శ్రీరామ రక్షగా నిలుస్తాయి, మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్.. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క చరణ్..పుట్టిన రోజు సందర్బంగా ఉదయాన తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు చరణ్ దంపతులకు స్వాగతం పలికారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే..శంకర్ డైరెక్షన్లో ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో చరణ్‌ నటిస్తున్నారు. ఆర్‌సీ 16 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Read Also : Kavitha First Day In Tihar Jail : తీహార్ జైల్లో దిగులు..దిగులుగా కవిత

  Last Updated: 27 Mar 2024, 12:04 PM IST