HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ ఉన్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో తన పాలనని పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేయాలని కుదిరినప్పుడల్లా షూట్ కి డేట్స్ ఇస్తూ షూటింగ్స్ చేస్తున్నాడు పవన్. ఈ క్రమంలో హరిహర వీరమల్లు షూటింగ్ గత కొంతకాలంగా విడతల వారీగా పూర్తిచేసుకుంటూ వస్తున్నాడు పవన్.
ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ అవ్వగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో హరిహర వీరమల్లు షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ నిన్నటి నుంచి జరుగుతుండగా నేడు పవన్ కళ్యాణ్ ఈ షూట్ లో జాయిన్ అవ్వనున్నారు. హరిహర వీరమల్లు షూటింగ్ మంగళగిరి సమీపంలో ఖాళీ ప్రదేశంలో వేసిన సెట్ లో జరుగుతుంది. పవన్ ప్రభుత్వ పనులకు ఆటంకం కలగకుండా హైద్రాబాద్ రాకుండా విజయవాడ, మంగళగిరి పరిసర ప్రాంతాల్లోనే ఇలా సెట్స్ వేసి సినిమాను పూర్తిచేస్తున్నారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి పవన్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని సమాచారం.
ఇక జ్యోతికృష్ణ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మాణంలో ఈ హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతుంది. ఇది పవన్ కళ్యాణ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమాగా హరిహర వీరమల్లుని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నిధి అగర్వాల్.. లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మార్చ్ 28న హరిహర వీరమల్లు సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
Also Read : Vikrant Massey : ఇటీవలే వరుస హిట్లు.. ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరో..