Site icon HashtagU Telugu

Pawan Kalyan : వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్..!

Pawan Kalyan Hari Hara Veeramallu Nidhi Agarwal Poster

Pawan Kalyan Hari Hara Veeramallu Nidhi Agarwal Poster

Pawan Kalyan దాదాపు నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉన్న హరి హర వీరమల్లు సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలు వదులుకున్నారు. ఐతే ఈ సినిమా విషయంలో మేకర్స్ మాత్రం ఇంకా పట్టు వదట్లేదు. పవన్ ఎప్పుడు డేట్స్ ఇచ్చినా సరే సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో మొదలైన వీరమల్లు సినిమా ఇప్పుడు క్రిష్ ఎగ్జిట్ అవ్వడంతో జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. వెరమల్లు సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు.

మొదటి భాగానికి సంబందించిన టీజర్ రీసెంట్ గా రిలీజై మంచి బజ్ ఏర్పరచుకుంది. ఐతే లేటెస్ట్ గా వీరమల్లు సినిమా నుంచి హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) పోస్టర్ రిలీజైంది. చూడచక్కని అందంతో ఒక రాజకుమారిలా కనిపిస్తుంది నిధి అగర్వాల్. మొన్నటిదాకా యువ హీరోలతో నటించిన నిధి అగర్వాల్ కెరీర్ లోనే సూపర్ ఛాన్స్ ఇదని చెప్పొచ్చు.

Also Read : Rajamouli : రాజమౌళి డాక్యుమెంటరీ మన వాళ్లు పట్టించుకోరేంటి..?

నిధి సింపుల్ లుక్స్ తో ఒక పోస్టర్ వదిలారు. నేడు నిధి అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్ వదిలారు. హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాల్లని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ రేసులో ఆల్రెడీ అల్లు అర్జున్, రాం చరణ్ ఉన్నారు. మరి వారికి పోటీగా వీరమల్లు వస్తాడా లేదా అన్నది చూడాలి.

2025 సంక్రాంతికి ఆల్రెడీ చిరు సినిమా కన్ఫర్మ్ అయ్యింది. కాబట్టి కుదిరితే డిసెంబర్ లోగా లేదంటే 2025 సమ్మర్ కే వీరమల్లు రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఐతే పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా మీద కన్నా ఓజీ మీద ఎక్కువ గురి పెట్టుకుని ఉన్నారు. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది.