Site icon HashtagU Telugu

Pawan Kalyan : నాలుగేళ్ల హరి హర.. అయినా ముందుకు కదలదా..?

Pawan Kalyan Hari Hara Veeramallu Four Years In Production

Pawan Kalyan Hari Hara Veeramallu Four Years In Production

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లీడ్ రోల్ లో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా హరి హర వీరమల్లు. సూర్య నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదలు పెట్టి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తవుతున్నా కూడా సినిమా ఇంకా పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైం పీరియాడికల్ కథతో వస్తుండగా సినిమా మొదలు పెట్టిన టైం లో బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది.

We’re now on WhatsApp : Click to Join

ఇక పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రోమో సినిమాపై మరింత హైప్ తెచ్చింది. అయితే ఆ తర్వాత సినిమాను పట్టించుకోలేదు. మధ్యలో కరోనా వల్ల కొన్నాళ్లు షూటింగ్ ఆపేశారు. పవన్ బిజీ వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. అలా నాలుగేళ్ల నుంచి హరి హర వీరమల్లు సినిమా సెట్స్ మీదే ఉంది. ఈ సినిమా ఐదో సంవత్సరంలోకి కూడా ఎంటర్ అయ్యింది.

ఇప్పటికి కూడా సినిమా పూర్తి చేసేలా పవన్ కళ్యాణ్ డేట్స్ అందుబాటులో లేవు. వెయిట్ చేసి చేసి క్రిష్ త్వరలో మరో సినిమా మొదలు పెడుతున్నాడని తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల బిజీ అయ్యాక మొదట ఓజీకి డేట్స్ ఇస్తాడని తెలుస్తుండగా హరి హర సినిమాను కూడా పూర్తి చేసేలా దర్శక నిర్మాతలు అడుగుతారని తెలుస్తుంది.

Also Read : Pushpa Recap : బాహుబలి, కె.జి.ఎఫ్ కి అలా.. మరి పుష్ప కోసం సుక్కు ఎలా ప్లాన్ చేస్తున్నాడు..?