Pawan Wishes Mahesh: కృష్ణ అడుగుజాడల్లో నడుస్తూ, విభిన్న పాత్రల్లో మెప్పిస్తూ.. మహేశ్ కు పవన్ బర్త్ డే విషెస్!

మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి.

Published By: HashtagU Telugu Desk
Pawan And Mahesh

Pawan And Mahesh

ఇవాళ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే. ఆయన బర్త్ డేను పురస్కరించుకొని టాలీవుడ్ ప్రముఖులు, హీరోలు, హీరోయిన్స్ మహేశ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేేపథ్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో టాలీవుడ్ నుద్దేశించి మాట్లాడుతూ మహేశ్, ప్రభాస్ నాకంటే పెద్ద హీరోలు అని ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహేశ్ బర్త్ డే సందర్భంగా పవన్ సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు.

‘‘తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణ గారి అడుగుజాడల్లో వెళ్తూ, విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదరసమానుడైన శ్రీ మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా మహేశ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

తాజాగా నేడు మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో గుంటూరు కారం నుంచి మహేష్ బాబు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మహేష్ బాబుకి బర్త్ డే విషెష్ చెప్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లో మహేష్ లుంగీ కట్టి, బీడీ కాలుస్తూ కళ్ళజోడు పెట్టి మాస్ లుక్ లో ఉన్నాడు. అలాగే సినిమా రిలీజ్ పై వస్తున్న వార్తలకు కూడా కౌంటర్ ఇస్తూ గుంటూరు కారం సినిమాని వచ్చే సంక్రాంతికే 12 జనవరి 2024న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Pawan Kalyan: ఆ దృశ్యాలు చూస్తే గుండె బరువైపోతుంటుంది: పవన్ కళ్యాణ్ ఎమోషనల్

  Last Updated: 09 Aug 2023, 12:00 PM IST