- పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కలయికలో మూవీ
- పవన్ మూవీ ని ప్రకటించిన నిర్మాత రామ్ తళ్లూరి
- పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సెట్ అయ్యేలా కథ
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓభారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మించనున్నారు. “డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్” అంటూ రామ్ తళ్లూరి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా, సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్‌తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.
Pawan Next
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి స్టార్ రైటర్ వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. సురేందర్ రెడ్డి – వక్కంతం వంశీ జోడి గతంలో ‘కిక్’, ‘రేసుగుర్రం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించిన నేపథ్యంలో, పవన్ కోసం వారు ఎలాంటి కథను సిద్ధం చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ డ్రామా అని, పవన్ కళ్యాణ్ నటనలోని మాస్ మరియు క్లాస్ అంశాలను బ్యాలెన్స్ చేసేలా స్క్రిప్ట్ రూపొందించినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ మరియు ఇతర నటీనటుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, తన మునుపటి కమిట్‌మెంట్లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సమ్మర్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
