పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కోలీవుడ్ హీరో ధనుష్(Dhanush ) కు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన ఆయన, తన అభిమాన తెలుగు హీరో ఎవరో అనేకసార్లు బయటపెట్టారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా అదే విషయాన్ని మరోసారి ధనుష్ వెల్లడించారు. “తెలుగులో డైరెక్ట్ చేయాల్సి వస్తే ఎవర్ని చేస్తారు?” అని సుమ అడిగితే ధనుష్ ఏ మాత్రం తడుముకోకుండా “పవన్ కళ్యాణ్ సార్” అని వెంటనే చెప్పారు. దీంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
Mobile While Eating: భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ చూడటం ఆరోగ్యానికి హానికరమా!
తమిళంలో నటుడిగానే కాదు, దర్శకుడిగానూ ధనుష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేసిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే చిత్రం కూడా యువతను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ఇడ్లీ కడై’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా కథనంతో పాటు దర్శకత్వం పట్ల కూడా ధనుష్ చూపిస్తున్న ఆసక్తి పరిశ్రమలో ప్రత్యేకంగా నిలుస్తోంది.
ధనుష్ ప్రస్తుతం నటించిన తాజా చిత్రం కుబేర.. తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందింది. ఇందులో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూన్ 20న మూడు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలన్న ధనుష్ కల మాత్రం రాబోయే రోజుల్లో సాకారమైతే అది అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన క్షణం అవుతుంది.