ఏపీ ఎలక్షన్స్ (AP Elections) లో గెలిచిన పవన్ ఇప్పుడు చూస్తుంటే పూర్తిస్థాయిలో రాజకీయ నేతగా మారినట్టే అనిపిస్తుంది. ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసేలా ప్రణాళిక చేస్తున్నారు. ఐతే పవన్ పాలిటిక్స్ లో ప్రస్తుతానికి అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టే లెక్క. ఐతే తను కమిటైన సినిమాలను ఒక కొలిక్కి తీసుకు రావాల్సి ఉంది.
ముఖ్యంగా హరి హర వీరమల్లు సినిమాను పవన్ దాదాపు నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉంచాడు. క్రిష్ డైరెక్షన్ (Krish Direction) లో మెగా సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం రత్నం ఈ సినిమా నిర్మిస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ నుంచి తప్పుకోగా జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. సినిమా పూర్తి చేయడానికి పవన్ మరో 20 రోజులు డేట్స్ కావాలి. అందుకోసం ఏ.ఎం రత్నం పవన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఐతే పవన్ కూడా ముందు వీరమల్లు (Veeramallu) సినిమాను పూర్తి చేస్తానని నిర్మాతకు మాటిచ్చారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టు 3వ వారం లేదా చివరి వారం నుంచి పవన్ వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటారని అంటున్నారు. వారంలో షూటింగ్ ఒక రెండు మూడు రోజులు పెట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారట.
సో పవన్ వచ్చాడు అంతే వీరమల్లు ముగించేస్తారనే చెప్పాలి. సాధ్యమైనంత వరకు సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. లేదా 2025 సంక్రాంతికైనా సినిమా వచ్చే ఛాన్స్ ఉందని టాక్. మొత్తానికి హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొనబోతున్నాడని తెలిసి ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారని తెలిసిందే. పవన్ సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఓజీ సినిమాకు కూడా పవన్ మరో రెండు వారాలు డేట్స్ ఇస్తే పూర్తవుతుందని తెలుస్తుంది. ఐతే ఈ ఇయర్ పవన్ కళ్యాణ్ నుంచి వీరమల్లు మాత్రమే వచ్చే ఛాన్సులు ఉన్నాయి.