Site icon HashtagU Telugu

Pawan Kalyan : చిరంజీవిని కామెంట్ చేశాడని.. రౌడీని చితకొట్టిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan fight with Rowdies for Chiranjeevi

Pawan Kalyan fight with Rowdies for Chiranjeevi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి తన అన్న చిరంజీవి(Chiranjeevi) అంటే ఎంత ప్రేమ, అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఆ ప్రేమని ప్రత్యేక్షంగా అందరూ చూస్తూనే ఉంటారు. అయితే గతంలో పవన్ టీనేజ్ సమయంలో జరిగిన ఓ సంఘటన చాలా తక్కువమందికి తెలుసు. తన అన్నయ్య చిరంజీవిని కామెంట్ చేశాడని ఓ రౌడీని పవన్ కళ్యాణ్ చితకొట్టేశారు. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది..?

తమిళనాడులోని(Tamilnadu) కోడంబాకం ఏరియా అప్పటిలో రౌడీలకు అడ్డా. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ ని కోడంబాకం గెస్ట్ హౌస్ లో షూట్ చేశారు. ఆ షూటింగ్ సమయంలో కొంతమంది రౌడీ మూకలు అక్కడికి చేరుకొని చిరంజీవిని.. ఏ ‘గోల్టి హీరో’ అని కామెంట్ చేయసాగారు. తమిళంలో తెలుగు వారిని గోల్టి అంటూ అవమానించేవారు. షూటింగ్ జరుగుతునంత సమయం చిరంజీవిని, చిత్ర యూనిట్ కామెంట్ చేస్తూనే ఉన్నారు.

ఇంతలో లంచ్ బ్రేక్ రావడంతో చిరంజీవి భోజనం చేయడానికి టి-నగర్ ఇంటికి వెళ్లారు. కారు డ్రైవర్.. ఆ రౌడీలపై పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్ అని చిరుతో చెప్పాడు. కానీ చిరు.. ‘ఎందుకు గొడవ ఇంక రెండు గంటలేగా షూటింగ్. ఓపిక పడితే ప్రశాంతంగా ఎవరి దారిని వాళ్ళు వెళ్లిపోవచ్చు’ అని చెప్పారట. ఇక భోజనం చేసి చిరు సెట్స్ కి వచ్చి చూస్తే.. డైరెక్టర్, హీరోయిన్ తప్ప మిగిలిన వారంతా కనిపించడం లేదు. ఏమైందని చిరు కనుక్కుంటే అసలు విషయం తెలిసింది.

చిరుని ఆ రౌడీలు కామెంట్ చేయడం పవన్ కళ్యాణ్ చూశారట. చిరు వెళ్ళాక ఆ రౌడీల దగ్గరకి వెళ్లి అలా చేయొద్దని చెప్పినా.. వారు వినలేదు. ఇక మాట మాట పెరిగి ఒక రౌడీ పవన్ షర్ట్ పట్టుకున్నాడు. ఇక కోపం వచ్చిన పవన్.. తన కరాటే విద్యనంతా వారి పై ప్రయోగించాడు. పవన్ దెబ్బలకి రౌడీలంతా పరుగులు తీశారు. ఒక్కడు మాత్రం పవన్ చేతికి చిక్కిపోవడంతో.. అతడిని చితకొట్టేశారు.

ఇక ఈ విషయమంతా తెలుసుకున్న చిరంజీవి.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆ రౌడీ దగ్గరకి వెళ్లి పరామర్శించి వచ్చారట. అలా కొట్టినందుకు పవన్ కళ్యాణ్ ని గట్టిగా తిట్టారట. ఇక అన్నయ్య కోపాన్ని అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్.. తరువాతి రోజు ఆ రౌడీ దగ్గరకి వెళ్లి క్షమాపణలు చెప్పి, తన హాస్పిటల్ ఖర్చులు అన్ని వదిన సురేఖ సాయంతో తానే పెట్టుకున్నారట. ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్, ఆర్జీవీ కూడా ఓ సందర్భంలో మాట్లాడారు.

 

Also Read : Mahesh Babu: ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న మహేశ్ బాబు, సెలబ్రేషన్స్ లో ఫ్యాన్స్