Site icon HashtagU Telugu

Pawan Kalyan : అప్పుడు ఎన్టీఆర్.. ఇటీవల విజయ్.. ఇప్పుడు పవన్.. ఈసారి ఫైట్ ఎలా ఉంటుందో..?

Pawan Kalyan Fight With Animal After Ntr And Vijay

Pawan Kalyan Fight With Animal After Ntr And Vijay

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక యోధుడిగా కనిపిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామా మూవీ ‘హరిహర వీరమల్లు’. నేడు ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేసారు. నాలుగేళ్లు పాటు సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉండడంతో.. ఈ మూవీ పై పెద్దగా అంచనాలు లేవు. కానీ నేడు ఈ టీజర్ తో సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ టీజర్ ని రిలీజ్ చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్, అడవి జంతువు తోడేలు పేస్ టు పేస్ స్టిల్ తో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన తరువాత ఒక విషయం అర్ధమవుతుంది. మూవీలో పవన్ అండ్ తోడేలు మధ్య ఓ ఫైట్ ఉండబోతుందని ఆడియన్స్ భావిస్తున్నారు. టీజర్ లో అయితే ఈ ఫైట్ కి సంబంధించిన విజువల్స్ ని మాత్రం చూపించలేదు. కానీ టీజర్ పోస్టర్ లో మాత్రం ఫైట్ కి సంబంధించిన స్టిల్ ని చూపించారు.

కాగా ఇటీవల కాలంలో జంతువులతో హీరో ఫైట్ అనేది ట్రెండ్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తే, లియో సినిమాలో విజయ్ హైనాతో ఫైట్ చేసారు. ఆ రెండు ఫైట్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. మరి తోడేలుతో పవన్ చేసే పోరాటం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా లేదా చూడాలి.

ఈ చిత్రం కూడా రెండు పార్టులుగా రాబోతుంది. మొదటి భాగాన్ని స్వార్డ్ అండ్ స్పిరిట్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Also read : Ram Pothineni : ‘రెడీ’ కాంబో మళ్ళీ సెట్ అవుతుందా..? శ్రీనువైట్లతో రామ్ మూవీ టాక్స్..!