పవర్ స్టార్ ఫ్యాన్స్ సెప్టెంబర్ 2న ఆయన బర్త్ డే రోజు కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. స్టార్ బర్త్ డే లకు వారి సినిమాల రీ రిలీజ్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కానుకగా గబ్బర్ సింగ్ 4కే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇదిలాఉంటే పవర్ స్టార్ ఫ్యాన్ ఒకరు ఆయనకు సంబందించిన ఒక యానిమేటెడ్ వీడియో రిలీజ్ చేశారు. ఓజీ సినిమాను పోలి ఉన్న ఈ వీడియో 9 నిమిషాలకు అటు ఇటుగా ఉంది.
ఐతే ఈ వీడియో కంటెంట్ టేకింగ్ అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే ఈ వీడియో గూస్ బంప్స్ కలిగిస్తుందని చెప్పొచ్చు. సినిమాకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ సీన్ ఉంది. యానిమేటెడ్ అని స్పష్టంగా తెలుస్తున్నా అక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కనిపించేలా ఆయన హీరోయిజం చూపించారు.
ఏది ఏమైనా ఈ వీడియో చూస్తే ఆ కాన్సెప్ట్, వీడియో చేసిన అభిమానికి సినిమా కానెల్డ్జ్ ఎంత బాగా ఉందో అర్ధమవుతుంది. ఒక స్టార్ హీరో సినిమాలో విజిల్స్ వేసే సీన్ లా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) యానిమేటెడ్ వీడియో ఉంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియో తెగ నచ్చేసింది. ఐతే ఈ సీన్ ని ఓజీ లో ఉంచితే మాత్రం థియేటర్ లో రచ్చ కన్ ఫర్మ్ అని అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
హ్యారీ సిద్ధం చేసిన ఈ OG Animated Video వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి.
“INDIAN SAMURAI – THE #OG Shortfilm”
Kudos To @harish5233🫡💥@DVVMovies @iam_arjundas#TheyCallHimOG @PawanKalyan pic.twitter.com/KpRMulhKYY
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) August 28, 2024