Pawan Kalyan: పవన్ ఎంట్రీతో ఇన్‌స్టా షేక్.. 2 మిలియన్ల ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డ్!

పవన్ రాకతో ఇన్ స్టా షేక్ అవుతోంది. కొద్ది గంటల్లనే అత్యధిక మంది పవన్ ను ఫాలో అవుతున్నారు. 

Published By: HashtagU Telugu Desk
Pawan

Pawan

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్నా పవన్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక పవన్ రాకతో ఇన్ స్టా షేక్ అవుతోంది. కొద్ది గంటల్లనే అత్యధిక మంది పవన్ ను ఫాలో అవుతున్నారు. సోషల్‌ మీడియాలో ఆయన్ను అనుసరించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఇన్‌స్టా వేదికగా ఆయన్ను అనుసరించే వారి సంఖ్య 2మిలియన్లకు చేరుకుంది.

ఈ విషయాన్ని జనసేన పార్టీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. పవన్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ లోకి వస్తున్నారు అని తెలియగానే ఫాలోవర్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇక ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే పవన్ కళ్యాణ్ కు అత్యధిక వేగంగా వన్ మిలియన్ ఫాలోవర్స్ పెరిగారు. అయితే ఇప్పుడు ఆ రికార్డు మరింత పెరిగింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ రెండు మిలియన్ల ఫాలోవర్స్ ను కూడా సాధించడం విశేషం. సాధారణంగా ఏ సెలబ్రెటీ అయిన సరే ఏదో ఒక పోస్ట్ చేసి ఇన్స్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇస్తారు.

కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. అయినా కూడా ఊహించని స్థాయిలో ఆయనకు ఫ్యాన్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఈ విధంగా అరుదైన రికార్డును అందుకున్న ఏకైక హీరోగా పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి పవన్ కళ్యాణ్ మొదటి పోస్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: New CJs: హైకోర్టులకు కొత్త సీజేలు.. ఏపీకి జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్‌, తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదే

  Last Updated: 06 Jul 2023, 12:10 PM IST