ప్రజా గాయకుడు, విప్లవ నేత గద్దర్(Gaddar) నిన్న ఆదివారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం యావత్ తెలంగాణను విషాదంలో నింపింది. ఆయనకు అనేక మంది ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. నేడు హైదరాబాద్(Hyderabad) లో ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించి ఆయన స్కూల్ వద్దే అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు.
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి, గద్దర్ కి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎన్నో సార్లు గద్దర్ పవన్ కళ్యాణ్ నా తమ్ముడు అని, నాకు ఆర్ధికంగా ఎన్నో సార్లు సహాయం చేశాడని, మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని చెప్పారు. పవన్ కూడా గద్దర్ గురించి అనేక సందర్భాల్లో చెప్పారు. గద్దర్ మరణ వార్త విన్నప్పట్నుంచి పవన్ శోక సంద్రంలోనే ఉన్నారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి కంటతడి పెట్టారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ గద్దర్ ని గుర్తు చేసుకుంటూ ఓ రెండు ఎమోషనల్ వీడియోల్ని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఓ వీడియోలో.. నా అన్న ప్రజాయుద్ధ నౌక గద్దర్.. అంటూ స్వయంగా తన గొంతుతో వాయిస్ ఇస్తూ గద్దర్ గురించి కావ్యంలా చెప్పారు. పీడిత జనుల పాట గద్దర్.. అడవిలో ఆకు చెప్పిన కథ గద్దర్.. కోకిల పాట గద్దర్.. గుండెకు గొంతు వస్తే, బాధకు భాష వస్తే గద్దర్.. అన్నిటికి మించి నా అన్న గద్దర్.. జోహార్ అంటూ మరిన్ని లైన్స్ తో పవన్ తన బాధని తెలియచేశాడు.
అలాగే గతంలో గద్దర్.. తమ్ముడా పవన్.. అంటూ రాజకీయం గురించి చెప్పిన మాటలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఈ రెండు వీడియోల్ని చాలా ఎమోషనల్ గా పోస్ట్ చేశారు పవన్. ఈ వీడియోలతో మరోసారి గద్దర్, పవన్ అధ్య ఉన్న అనుబంధం తెలుస్తుంది. ఇక ఈ వీడియోలకు పవన్, గద్దర్ అభిమానులు ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Gaddar : ఎట్టకేలకు గద్దర్ మృతిపై స్పందించిన మావోయిస్టు పార్టీ..