Ustaad Bhagat Singh: ఆ మూవీకి డబ్బింగ్ చెబుతున్న పవన్ కళ్యాణ్.. అది అదే ఇది ఇదే అంటూ?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ గా, డాన్సర్ గా, రాజకీయ నాయకుడిగా, కొరియోగ్రాఫర్ గా ఇలా ఎన్నో రంగాలలో అనుభవం ఉన్న వ్యక్తి. అన్ని రంగాలలో రాణించడంతోపాటు తనదైన శైలిలో ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. అంటే ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 17 Mar 2024 03 18 Pm 3642

Mixcollage 17 Mar 2024 03 18 Pm 3642

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ గా, డాన్సర్ గా, రాజకీయ నాయకుడిగా, కొరియోగ్రాఫర్ గా ఇలా ఎన్నో రంగాలలో అనుభవం ఉన్న వ్యక్తి. అన్ని రంగాలలో రాణించడంతోపాటు తనదైన శైలిలో ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. అంటే ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రెండేళ్ల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయారు. దీంతో హరీష్ ఈ సినిమాని పక్కన పెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా పక్కన పెట్టేయడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై ఆశలు వదులుకున్నారు. ఎన్నికలు అయ్యాకే ఈ సినిమా ఉండచ్చు అని ఫిక్స్ అయ్యారు. కానీ నిన్న సడెన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్డేట్ రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించడంతో పవన్ అభిమానులు ఆశ్చర్యపోయారు.

 

ఇక నేడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కి డబ్బింగ్ చెప్తున్న ఫోటోలని తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు మూవీ యూనిట్. పక్కన హరీష్ శంకర్ ఉండి పవన్ తో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. మార్చ్ 19న ఈ సినిమాకు సంబంధించిన ఒక గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. పవన్ పొలిటికల్ కి ఉపయోగపడేలా, పొలిటిల్ డైలాగ్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఉండబోతున్నట్టు సమాచారం. దీంతో మరో రెండు రోజుల్లో రాబోయే ఈ గ్లింప్స్ కోసం పవన్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూట్ మాత్రం ఎన్నికలు అయ్యాకే ఉంటుంది. ఇప్పుడు కేవలం పొలిటికల్ గా ఉపయోగపడటానికి ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారని సమాచారం. ఇక పవన్ డబ్బింగ్ చెప్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 17 Mar 2024, 03:20 PM IST