Site icon HashtagU Telugu

Pawan Kalyan Divorce Once Again : పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు తీసుకోబోతారని బాంబ్ పేల్చిన జ్యోతిష్యుడు

Pawan Kalyan Is Going To Get Divorced Again, The Astrologer Who Exploded The Bomb

Pawan Kalyan Is Going To Get Divorced Again, The Astrologer Who Exploded The Bomb

ఈ మధ్య జ్యోతిష్యుడు వేణు స్వామి (Astrologer Venuswami) పేరు వైరల్ గా మారింది..సినీ ప్రముఖుల తాలూకా జ్యోతిష్యం (Astrology ) చెపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. వేణు స్వామి చెప్పిన జాతకాలలో కొన్ని నిజం కాగా చాలావరకు అబద్దం అయ్యాయి. అయినప్పటికీ ఎప్పటికి ఈయన పేరు వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా చిత్రసీమ (Film Industry )కు సంబదించిన నటి నటులతో పరిచయాలు..వారిచేత పూజలు చేయించడం..వారి జాతకాలను తెలియజేస్తుండడం తో సినీ లవర్స్ ఎక్కువగా ఈయన్ను ఫాలో అవుతూ..ఈయన చేసిన కామెంట్స్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.

ఈయన రీసెంట్ గా ప్రభాస్ (Prabhas) కెరియర్ అయిపోయింది అని చెప్పడమే కాదు.. సలార్ (Salaar) సినిమాతో మళ్ళీ బొక్క బోర్ల పడతాడు అని చెప్పి ఆయన బొక్క బోర్లాపడ్డాడు. ప్రభాస్ నటించిన సలార్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అలాగే తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ (KCR) గెలుస్తారని కూడా చెప్పుకొచ్చారు. అక్కడ కూడా ఈయన బోర్లా పడ్డాడు. తాజాగా ఈయన పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మరోసారి విడాకులు (Divorce Once Again)తీసుకోబోతారని..ఈ ఏడాది లో ఇదే వివాదాస్పదం కాబోతుందని తెలిపి వార్తల్లో నిలిచారు. అతని సినిమా పరంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కాంట్రవర్సీలకు గురవుతారని.. వాటన్నింటిని ఆయన ఎదుర్కోక తప్పదు అంటూ చెప్పుకొచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కళ్యాణ్.. కేవలం త్రివిక్రమ్ (Trivikram) మాట మాత్రమే వింటారని.. కానీ త్రివిక్రమ్ ఆయన పర్సనల్ విషయాలలోకి మాత్రం జోక్యం చేసుకోరని తెలిపారు వేణు స్వామి.. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మేలుకోవాలని.. తాను ఏం చేస్తే సీఎం అవుతానో అర్థం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. వేణు స్వామి కామెంట్స్ ఫై అభిమానులు , జనసేన (Janasena) కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఫై ఇలా ఫేక్ ప్రచారం చేసి ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనీ జగన్ చేస్తున్న కుట్రలో భాగమే అని అంటున్నారు. వేణు స్వామి..జగన్ బినామీ అని, ఆయన చెప్పినట్లు వేణు చెపుతాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి పవన్ కళ్యాణ్ విషయంలో జోక్యం చేసుకొని వేణు ప్రచారం అవుతున్నారు.

Read Also : CM Jagan: ముగిసిన సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన