Site icon HashtagU Telugu

Pawan Kalyan : తగ్గేదేలే అని నాకు చెప్పడం కాదు.. బన్నీ ఫ్యాన్స్‌కి పవన్ చురకలు..

Pawan Kalyan Counter To Allu Arjun Fans Video Gone Viral

Pawan Kalyan Counter To Allu Arjun Fans Video Gone Viral

Pawan Kalyan : జనసేన అధినేత ఎన్నికల ప్రచారంలో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక ఈ కాంపెయిన్ లో ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తూ వస్తున్న పవన్.. మధ్యమధ్యలో టాలీవుడ్ హీరోల అభిమానులకు కూడా చురకలు అంటిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ కాంపెయిన్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ చురకలు అంటించారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “అల్లు అర్జున్ గారి అభిమాని ఒకరు పుష్ప పోస్టర్ చూపిస్తూ తగ్గేదేలే అంటున్నారు. అందుకు నాకు సంతోషమే. అయితే తగ్గేదేలే అని నా ముందు చెప్పడం కాదు. రేపు ఎన్నికల్లో ఓటు వేసి వైసీపీని అధికారం నుంచి దించి, ఆ తరువాత చెప్పండి తగ్గేదేలే అని” అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఓటు హక్కు ఉన్న యువతకి కూడా పవన్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉంటే, నేడు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇక ఈ సాంగ్ లో అల్లు అర్జున్.. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ని ప్రమోట్ చేస్తూ ఓ స్టెప్ వేశారు. ప్రస్తుతం ఈ స్టెప్ ని పవన్ అభిమానులు, జనసైనికులు నెట్టింట వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు.

కాగా ఈ ఎన్నికల ప్రచారంలో మెగా హీరోల సందడి కూడా కనిపిస్తుంది. చిరంజీవి, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్.. ఇలా మెగా హీరోలంతా పవన్ కి మద్దతు తెలుపుతూ కాంపెయిన్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ హీరోల మాదిరి అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ప్రచారంలోకి దిగుతారా లేదా అనేది ప్రశ్నగా మారింది.