Chiru – Pawan : చిరు నటించిన సీన్‌ని.. అలాగే కాపీ చేసిన పవన్.. మీరు చూసేయండి..

తను రచయితగా కథ అందించిన సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్'(Sardar Gabbar Singh). పవన్ బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్'కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీకి పవన్ స్టోరీని రాశాడు.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Copied a Scene for Sardar Gabbar Singh Movie from Chiranjeevi Puli Movie

Pawan Kalyan Copied a Scene for Sardar Gabbar Singh Movie from Chiranjeevi Puli Movie

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని మాత్రమే కాదు సూపర్ స్టార్‌డమ్ ని అందుకున్న నటుడు ‘పవన్ కళ్యాణ్'(Pawan Kalyan). అయితే పవన్ నటుడిగా మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగలేదు. దర్శకుడిగా, రచయితగా కూడా తన టాలెంట్ ని ప్రేక్షకులకు చూపించాడు. ‘జానీ’ సినిమాతో దర్శకుడిగా సినిమా తెరకెక్కించిన పవన్ కళ్యాణ్.. ఇతర దర్శకులతో తను చేసిన కొన్ని సినిమాల్లో కూడా రచయితగా తన సహకారం అందించాడు.

ఈక్రమంలోనే తను రచయితగా కథ అందించిన సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్'(Sardar Gabbar Singh). పవన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీకి పవన్ స్టోరీని రాశాడు. బాబీ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. కాగా ఈ మూవీలోని ఒక సీన్ ని పవన్.. చిరంజీవి సినిమాలో నుంచి అలాగే కాపీ చేసేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ ఎక్కువుగా ‘బార్బర్ షాప్’లో కనిపిస్తాడు. ఇక ఒక ఫైట్ సీన్ సమయంలో పవన్ కళ్యాణ్.. షేవింగ్ చేయించుకుంటూ ఉంటాడు. అప్పుడే విలన్స్ రావడంతో సగం గీసిన గడ్డంతో వెళ్లి ఫైట్ చేసి వచ్చి మిగిలిన షేవింగ్ ని చేయించుకుంటాడు.

ఈ సీన్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. అయితే ఈ సీన్ ని చిరు ఆల్రెడీ చేసేశాడు. 1985లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పులి’ సినిమాలో సేమ్ ఇలాంటి సీన్ ఉంటుంది. ఆ మూవీలో చిరంజీవి కూడా పోలీస్. ఇక చిరుని ఎంతో అమితంగా అభిమానించే పవన్ కళ్యాణ్.. ఆ సీన్ ని రీ క్రియేట్ చేస్తూ రాసుకున్నాడు. పవన్ చేసిన ఈ సీన్ కి కూడా అభిమానుల్లో మాస్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో పవన్.. చిరంజీవి ఐకాన్ స్టెప్ ‘దాయి దాయి దామ్మా’ని కూడా తనదైన స్టైల్ లో వేసి అదరగొట్టాడు.

Also Read : Rashmika Mandanna : రష్మిక లైనప్ మాములుగా లేదుగా.. సౌత్, నార్త్ ఊపేస్తోంది..

  Last Updated: 07 Oct 2023, 07:28 PM IST