ఆదివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు (TFCC Elections) జరుగగా..ఈ ఎన్నికల్లో నిర్మాత సి కళ్యాణ్ ప్యానల్ ఫై దిల్ రాజు ప్యానల్ విజయం (Dil Raju’s Panel Wins) సాధించింది. ఈ తరుణంలో దిల్ రాజు ప్యానల్ సభ్యులకు సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )అభినందనలు తెలిపారు.
‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు. అధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి, సెక్టార్ కౌన్సిల్ చైర్మన్లు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు.. మండలి కార్యకలాపాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్షిస్తున్నాను. ఒక సినిమా నిర్మితమవుతోందంటే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. రూ.కోట్ల సంపద సృష్టి జరుగుతుంది. పన్నులు చెల్లిస్తారు. తెలుగు సినిమా స్థాయి వాణిజ్యపరంగా రోజురోజుకీ విస్తృతమవుతోంది. కాబట్టి పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం పని చేస్తుందని ఆశిస్తున్నాను..’’ అంటూ పవన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.
ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల విషయానికి వస్తే..ఫిలిం చాంబర్ (Film Chamber)లో మొత్తం 1600 మంది సభ్యులు ఉండగా.. 891 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రొడ్యూసర్ సెక్టార్‌లో 1600 ఓట్లకు 891 ఓట్లు పోల్ కాగా.. స్టూడీయో సెక్టార్‌లో 98 ఓట్లకు 68 పోల్ అయ్యాయి. ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో 597 ఓట్లకు 380 పోలయ్యాయి.
ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో 12 మందిలో దిల్‌రాజు ప్యానల్ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు. స్టూడియో సెక్టార్ నుంచి గెలుపొందిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్ కాగా డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు. మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్‌కు 563ఓట్లు, సి.కళ్యాణ్ ప్యానల్‌కు 497 ఓట్లు పోలయ్యాయి.
Read Also : Telangana High Court : అయోమయంలో 26 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?