Pawan Kalyan : సాయి ధరమ్ తేజ్ పై దాడి చేసారు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..

యాక్సిడెంట్ నుంచి కోలుకొని పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసేందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ పై దాడి చేసారు. ఈ దాడిలో..

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Comments About Attack On Sai Dharam Tej In Janasena Campaign

Pawan Kalyan Comments About Attack On Sai Dharam Tej In Janasena Campaign

Pawan Kalyan : ఈసారి ఎన్నికల్లో జనసేనాని కోసం దాదాపు సినిమా పరిశ్రమ అంతా కదిలివచ్చింది. మెగా ఫ్యామిలీతో పాటు టీవీ ఆర్టిస్టులు, నిర్మాతలు, డాన్స్ మాస్టర్, రైటర్స్, డైరెక్టర్స్.. ఇలా ప్రతి ఒక్కరు పవన్ కోసం వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల మెగా ఫ్యామిలీ నుంచి సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ కోసం పలు ప్రాంతాల్లో ప్రచారం చేసారు. అయితే ఈ ప్రచారంలో సాయి ధర్మ తేజ్ పై దాడి జరిగింది.

పవన్ కోసం ప్రచారం చేస్తున్న సాయి ధర్మ తేజ్ పై గాజు బాటిల్ ని విసిరారు. అయితే ఆ బాటిల్ సాయి ధర్మ తేజ్ కి కాకుండా మరో వ్యక్తికి వెళ్లి తగిలింది. ఈ దాడి ఆ వ్యక్తి తలకి తీవ్ర గాయం అయ్యి బాగా రక్తస్రావం అయ్యింది. ఇక దాడి గురించి పవన్ తన రీసెంట్ మీటింగ్ లో మాట్లాడారు.

“ఆల్రెడీ యాక్సిడెంట్ కి గురయ్యి గట్టి దెబ్బని ఎదుర్కొన్న సాయి ధరమ్ తేజ్.. నాకోసం ప్రచారం చేయడానికి వచ్చాడు. అతడి పై కూడా వైసీపీ గుండాలు దాడి చేసారు. బాటిల్ తో అతడి పై దాడి చేసారు. అయితే ఆ బాటిల్ తనకి కాకుండా టీడీపీ వ్యక్తికి తగిలి పెద్ద గాయం అయ్యింది. తాను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఇలా దాడులు చేసి బయటకి రావాలంటే కూడా భయపడేలా వైసీపీ గుండాలు చేస్తున్నారు” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

కాగా సాయి ధరమ్ తేజ్ కి ఆ మధ్య బైక్ యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. దాని నుంచి కోలుకొని ఓ సినిమాని కూడా చేసిన తేజ్.. మల్లి ఇటీవలే ఓ శాస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న తేజ్.. తమ మేనమామ కోసం ప్రచారం చేయడానికి ఏపీ రోడ్డుల మీదకి వచ్చారు.

  Last Updated: 11 May 2024, 09:13 AM IST