Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ విషయంలో ఇది గమనించారా.. కమ్‌బ్యాక్ ఇన్ టెన్..

Pawan Kalyan Come Back In Both Cinema And Political Career

Pawan Kalyan Come Back In Both Cinema And Political Career

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాల్లోనే కాదు, పాలిటిక్స్ లో కూడా పవర్ స్టార్ అనిపించుకున్నారు. చిరంజీవి తమ్ముడిగా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన పవన్ కళ్యాణ్.. తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకొని పవర్ స్టార్ గా ఎదిగారు. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తమ్ముడు అనిపించుకునే స్థాయి నుంచి, పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి అనే స్టేజికి చేరుకున్నారు. ఇక రాజకీయాల్లో కూడా అంతే, చిరంజీవి ‘ప్రజారాజ్యం’తో ప్రజల్లోకి వెళ్లిన పవన్.. ఆ తరువాత జనసేనని గా ఎదిగారు.

ఇక పవన్ చేసిన ఈ రెండు జర్నీల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. అదే ‘కమ్‌బ్యాక్ ఇన్ టెన్’. సినిమా ఇండస్ట్రీలో ఒక సింపుల్ లవ్ స్టోరీ ‘ఖుషి’తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన పవన్ కళ్యాణ్.. ఆ తరువాత ‘జానీ’ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి విఫలమయ్యారు. అప్పటి నుంచి పదేళ్ల పాటు ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయారు. పవన్ నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్లాప్ అవ్వడంతో అభిమానులు చాలా నిరాశ చెందారు.

అలా పదేళ్ల అభిమానులు ఆ నిరాశలోనే ఉన్నారు. అయితే ఆ తరువాతే వచ్చింది ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్. దెబ్బకి ఇండస్ట్రీ లెక్కలు అన్ని మారిపోయాయి. ఆ తరువాత అత్తారింటికి దారేది సినిమాతో కూడా ఇండస్ట్రీ హిట్ ని పెట్టారు. ఇక పొలిటికల్ జర్నీలోకి వస్తే.. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసేయడంతో మెగా ఫ్యామిలీ పై ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ వ్యతిరేకతను తట్టుకొని పవన్ నిలబడి పదేళ్ల పోరాటం చేసారు.

2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకి సపోర్ట్ చేయడం కోసమే ఆ పార్టీ పెట్టారని, చిరంజీవిలా పవన్ కూడా తన పార్టీని టీడీపీ లేదా బీజేపీలో విలీనం చేసేస్తాడని ఎన్నో కామెంట్స్ చేసారు. అయితే పవన్ వాటన్నిటికీ ఎదురు నిలబడి నేడు భారతదేశంలో ఏ పార్టీ సాధించలేని విజయాన్ని సాధించింది. వంద శాతం స్ట్రైక్ రేటుతో జనసేన గెలుపొందింది. ఇలా సినిమా మరియు రాజకీయ రంగంలో పదేళ్ల గ్యాప్‌తో పవన్ గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు.