పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా రాబోతోంది. ఇకపోతే ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ లాంటి వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అత్యంత భారీ వ్యయంతో ఏఎం రత్నం ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ లో పవన్ కళ్యాణ్ గజ దొంగ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కూడా పవన్ వరుస సినిమాలతో బిజీ కాబోతున్నారు. ‘హరిహర వీరమల్లు’ మూవీ పూర్తయిన తర్వాత వెంటనే ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను చేయనున్నారు పవర్ స్టార్. ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను పలుమార్లు కలిసిన హరీష్ శంకర్… డేట్ల విషయమై పవన్ కళ్యాణ్ తో చర్చించగా… జూలైలో రెడీ గా ఉండమని హరీష్ శంకర్ తో పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. పవన్ సరసన ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం హీరోయిన్లను వెతికే పనిలో పడ్డారు దర్శకుడు హరీష్ శంకర్. మరోవైపు స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అవ్వడంతో… ఇక సినిమా మొదలు పెట్టడం ఒకటే మిగిలివుంది. మరి ‘పవన్-హరీష్ శంకర్’ కాంబోలో రెండవ మూవీ గా రాబోతున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ మరెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో అన్నది వేచి చూడాలి.
Pawan Kalyan : ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ కు క్లారిటీ ఇచ్చిన ‘పవర్ స్టార్’

Pawan Kalyan Harish Shankar