Kalki 2898 AD : ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడేనట.. అతిథులుగా ఆ నాయకులు..!

'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎక్కడ ప్లాన్ చేస్తున్నారో తెలుసా..? ఇక ఈ ఈవెంట్ లో అశ్విని దత్ ఎవర్ని తీసుకు రాబోతున్నారో తెలుసా..?

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Chandrababu Naidu Are Guests For Prabhas Kalki 2898 Ad Pre Release Event

Pawan Kalyan Chandrababu Naidu Are Guests For Prabhas Kalki 2898 Ad Pre Release Event

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో సి అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, పశుపతితో పాటు ఇతర పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మూవీ టీం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ ని ఎక్కడ నిర్వహించబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ చిత్ర నిర్మాత అశ్విని దత్.. టీడీపీ, అమరావతికి మొదటి నుంచి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతి పనులు కూడా మళ్ళీ మొదలవుతున్నాయి.

దీంతో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమరావతిలో నిర్వహించబోతున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. జూన్ 23న ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ ఈవెంట్ కి కూటమి నాయకులు.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ని తీసుకు రావాలని అశ్విని దత్ భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. ఒకవేళ ఇది నిజమైతే.. ఎన్నికల ఫలితాల తరువాత అమరావతిలో జరగబోతున్న మొదటి ఈవెంట్ ఇదే అవుతుంది.

  Last Updated: 10 Jun 2024, 06:22 PM IST