Site icon HashtagU Telugu

Tholi Prema : తొలిప్రేమ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు పవన్ చేతిలో గన్ ఉందట..

Pawan Kalyan carry a gun while listning Tholiprema Movie Story

Pawan Kalyan carry a gun while listning Tholiprema Movie Story

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాల్లో ‘తొలిప్రేమ'(Tholiprema)కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. లవ్ స్టోరీస్ లో ఆ సినిమా ఒక ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాతోనే కరుణాకరన్(Karunakaran) దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. అయితే ఈ సినిమా కథని కరుణాకరన్, పవన్ కి చెప్పినప్పుడు అనేక ఆసక్తికర సంఘటనలు జరిగాయని పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు.

కరుణాకరన్ ఈ సినిమా కథ రాసుకున్న తరువాత ఏ హీరోకి చెప్పాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక మ్యాగజైన్ పై పవన్ కళ్యాణ్ ఫోటో చూశాడట. అది చూడగానే పవనే తన హీరో అని ఫిక్స్ అయిపోయాడట. ఆ తరువాత పవన్, చిరంజీవి తమ్ముడు అని తెలిసింది. ఇక కథ వినిపించడానికి పవన్ ఎలా కలవాలి అనుకుంటున్న సమయంలో కరుణాకరన్ తెలుగు సినిమా చర్చల్లో భాగంగా ఒకసారి హైదరాబాద్ వచ్చాడు.

ఇక్కడి పరిచయాలతో పవన్ కళ్యాణ్ బాబాయ్ సూర్యంకి పరిచయం అవ్వడంతో పవన్ కరుణాకరన్ కి అపాయింట్మెంట్ రాత్రి 7 గంటలకు ఇచ్చాడు. హోటల్ నుంచి పవన్ దగ్గరకి కారులో బయలుదేరగా మధ్యలో కారు టైర్ పంక్చర్ అయ్యింది. అది రిపేర్ చేసుకొని 8:30 గంటలకి పవన్ దగ్గరకి వెళ్ళాడట. అప్పటికే పవన్ చాలా కోపంలో ఉన్నాడట. అంతేకాదు చేతిలో గన్ కూడా ఉందట. భయంతో దగ్గరకి వెళ్లి తనని తాను పరిచయం చేసుకున్న కరుణాకరన్, పవన్ తో.. ‘కథ నచ్చకపోతే గన్ తో కాల్చేయరుగా’ అని అడిగాడట. ఆ మాటకి పవన్ గట్టిగా నవ్వేశాడట. అంతే పవన్ కోపం అంతా పోయి కూల్ అయ్యిపోయాడు. దీంతో కరుణాకరన్ స్టోరీబోర్డ్ వేసి కథ చెప్పాడట. కథ బాగా నచ్చడంతో పవన్ వెంటనే ఓకే చెప్పేశాడట. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిందే.

 

Allari Naresh : ఆ భయంతో ‘కార్తికేయ’ సినిమా వదులుకున్న అల్లరి నరేష్.. ఎందుకో తెలుసా..?