Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలు చేయడం కష్టం అయిపోయింది. ఇక ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం, మంత్రి అయ్యాక మరింత బిజీ అవ్వడంతో సినిమాలకు డేట్స్ ఇవ్వడం చాలా కష్టం. కానీ ఫ్యాన్స్ కోసం ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు ఎలాగైనా పూర్తిచేస్తానని మాట ఇచ్చాడు. నిర్మాతల దగ్గర ఆల్రెడీ రెమ్యునరేషన్ కూడా మొత్తం తీసేసుకోవడంతో కచ్చితంగా సినిమాలు చేయాల్సిన పరిస్థితి.
మొత్తానికి ఎలాగో ఖాళీ చేసుకొని హరిహర వీరమల్లు షూట్ అయితే మొదలుపెట్టారు. ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తిచేయగా రెండో షెడ్యూల్ ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. నవంబర్ 10 వరకు హరిహర వీరమల్లు షూట్ మొత్తం పూర్తిచేసేస్తారని సమాచారం. పవన్ రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు సినిమాలకు టైం ఇస్తున్నాడు. అందుకే షూటింగ్ సెట్స్ ని విజయవాడలోనే వేయించుకున్నాడు. అటు ప్రభుత్వం పనులు చేస్తూనే ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు.
ఇక తాజాగా నిన్న OG మూవీ యూనిట్ కూడా త్వరలోనే షూటింగ్ మొదలవ్వబోతుంది అని ప్రకటించింది. పవన్ కళ్యాణ్ ఓ 20 రోజులు డేట్స్ ఇస్తే ఈ షూట్ పూర్తవుతుంది. హరిహర వీరమల్లు షూట్ అవ్వగానే పవన్ దీనికి డేట్స్ ఇవ్వనున్నారు. ఫ్యాన్స్ OG సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు. త్వరలోనే పవన్ OG షూట్ లో కూడా జాయిన్ అవుతున్నాడు అని ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కోసం, నిర్మాతల కోసం కష్టమైనా అటు సినిమాలు ఇటు రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. ఇందుకు పవన్ ని ఫ్యాన్స్ తో పాటు అందరూ అభినందిస్తున్నారు.
We step into the #OG fever once again FIRING ON ALL CYLINDERS to create the madness..🔥🔥🔥#Sujeeth #TheyCallHimOG #FireStormIsComing pic.twitter.com/DOKm6X6Ylm
— DVV Entertainment (@DVVMovies) October 15, 2024
Also Read : Allu Arjun : బన్నీ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చిన అభిమాని.. వెళ్ళేటప్పుడు ఫ్లైట్‌లో..