Site icon HashtagU Telugu

NBK and PSPK: వీర సింహా రెడ్డితో ‘వీరమల్లు’.. ఫ్యాన్స్ కు పూనకాలే!

NBK and PSPK

Balaya

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కు భలే క్రేజ్ ఉంటుంది. కానీ కాంబినేషన్ కుదరాలంటే అంత ఈజీగా కాదు.. సరైన సమయమూ కావాలి. అన్నీ అనుకూలించాలి. అలాంటి రేర్ కాంబినేషన్ నెవ్వర్ బీఫోర్ అనేలా ఉంటుంది. బాక్సాఫీస్ బద్దలవుతుంది. నందమూరి బాలయ్య, పవన్ కళ్యాణ్ క్రేజీ కాంబినేషన్ హాట్ టాపిక్ గా మారింది. నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిశారు. అదీ ‘అన్‌స్టాపబుల్‌ 2’ కోసం! మంగళవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ చేయడానికి ఇద్దరు స్టార్స్ (NBK and PSPK) రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలవడం ఈ నెలలో ఇది రెండోసారి. సంక్రాంతి కానుకగా రానున్న బాలకృష్ణ సినిమా ‘వీర సింహా రెడ్డి’. లాస్ట్ వీక్ సాంగ్ షూటింగ్ జరిగింది. ఆ సాంగ్ షూట్ చేస్తున్న స్టూడియోలోని మరో ఫ్లోర్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ కోసం రెడీ అయ్యింది. అక్కడ ఔరంగజేబు దర్బార్ సెట్ వేశారు. బాబీ డియోల్, పవన్ మీద సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘హరి హర వీర మల్లు’లో ఔరంగజేబుగా బాబీ డియోల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడు సరదాగా కలిసి ఆసక్తిని రేపారు.

 

 

అభిమానుల హంగామా

అన్ స్టాబబుల్ షోలో భాగంగా ముందుగా నందమూరి బాలయ్య స్టూడియోకు చేరుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇద్దరు (NBK and PSPK) ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు. ఇటు బాలయ్య, అటు పవన్ కళ్యాణ్ అభిమానులతో అన్నపూర్ణ స్టూడియో దద్దరిల్లిపోయింది. దారిపొడవునా ఈ ఇద్దరి హీరోలకు సంబంధించిన కటౌట్లు ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎ సీఎం నినాదాలతో ఒక్కసారిగా స్టూడియో మార్మోగింది. పవన్ వెంట డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) కూడా ఉన్నారు.

బిగ్గెస్ట్ టాక్ షో
ఇక నిర్మాత అల్లు అరవింద్ అన్నపూర్థ స్టూడియోకు చేరుకొని మీడియాతో మాట్లాడారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో‌గా అన్ స్టాపబుల్ (Unstoppable) మారింది. ఈ షో ప్రారంభించడానికి ముందు మంచి టాక్ షో అవుతుందని భావించాం. కానీ ఇది ఇండియాలోనే అతిపెద్ద షో కావడం ఆనందంగా ఉంది. ఇండియాలోనే క్రేజీ షోగా రికార్డు క్రియేట్ చేసింది. తదుపరి ఎపిసోడ్ పవన్ కల్యాణ్‌తో ఉంటుంది. ఈ షోకు వస్తున్న పవర్ స్టార్‌కు నా థ్యాంక్స్ అని అరవింద్ (Allu aravind) అన్నారు.