Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో తనకి ఉన్న అశేషమైన స్టార్‌డమ్ ని వదులుకొని, ప్రజల కోసం రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ పొలిటికల్ జర్నీ వల్ల గత పదేళ్లుగా పవన్ తన కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. పండగలకి, ఫంక్షన్స్ కి కూడా పాల్గొనకుండా రాజకీయ చదరంగంలో పయనిస్తూ వెళ్లారు. ఇప్పుడు ఆ చదరంగంలో గెలిచిన పవన్ కళ్యాణ్.. ఇంటికి తిరిగి వచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెల్కమ్ పలికింది.
పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్.. కూటమి పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీలు గెలవడంలో కూడా పవన్ కీలక పాత్ర పోషించారు. దీంతో రెండు రోజుల నుంచి టీడీపీ, బీజేపీ నాయకులను కలుస్తూ గెలుపుని అభినందించుకుంటున్నారు. ఢిల్లీ NDA సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ నేడు తిరిగి వచ్చారు. ఇక రావడం ఆలస్యం తన అన్న మెగాస్టార్ చిరంజీవి దీవెనల కోసం వచ్చారు.
ఇక రచ్చ గెలిచి వచ్చిన తమ్ముడికి చిరంజీవి గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఇంటి వద్ద కారులో నుంచి దిగిన పవన్ పై పూలవర్షం కురిపించారు. రామ్ చరణ్ ఎదురెళ్లి బాబాయ్ ని ఇంటిలోకి తీసుకు వచ్చారు. ఇక పోరాడి వచ్చిన తమ్ముడిని చిరంజీవి ఉప్పొంగిపోయారు. గజమాల వేసి సంబరపడ్డారు. జై జనసేన, పవన్ కళ్యాణ్ అంటూ అరవండి అంటూ తాను సందడి చేసారు. ఇక రచ్చ గెలిచి వచ్చిన పవన్.. తన తల్లి అంజనాదేవి, వదిన సురేఖ, అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఎన్నికలలో అఖండ విజయం సాధించి, ఢిల్లీ NDA సమావేశంలో పాల్గొని మెగాస్టార్ దీవెనల కోసం తరలివచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్. @PawanKalyan @KChiruTweets @JanaSenaParty #PawanKalyan #MegaStarChiranjeevi pic.twitter.com/QTSBTVuRzQ
— BA Raju’s Team (@baraju_SuperHit) June 6, 2024