Site icon HashtagU Telugu

Pawan Kalyan : ఇటలీ నుండి హైదరాబాద్ కు చేరుకున్న పవర్ స్టార్

Pawan Kalyan Arrived Hydera

Pawan Kalyan Arrived Hydera

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ఇటలీ (Italy) నుండి హైదరాబాద్ (Pawan Kalyan Arrived Hyderabad) కు చేరుకున్నారు. నాల్గు రోజుల క్రితం నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ (Varun Tej) వివాహ నిమిత్తం పవన్ కళ్యాణ్..తన సతీమణి తో కలిసి ఇటలీకి వెళ్లిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల్లో ఎంతో ఉత్సహంగా పాల్గొన్న పవన్..శుక్రవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రమే వచ్చారు..ఆయన సతీమణి ఇటలీ లోనే ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మెగా ఫ్యామిలీ సభ్యులంతా కూడా ఇటలీ లోనే ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇంతకాలం ప్రేమించుకున్న వరుణ్ – లావణ్య లు ..వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం ఇటలీ లో కన్నుల పండుగగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక పెళ్లి వేడుకకు సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పవన్ -రామ్ చరణ్ పిక్ , చిరంజీవి , నాగబాబు , పవన్ కళ్యాణ్ లు కలిసి ఉన్న పిక్స్ ను మరింత వైరల్ చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే..ప్రస్తుతం OG తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు డిసెంబర్ పూర్తి అయ్యేలోపు పూర్తి చేయాలనీ చూస్తున్నాడు. అలాగే రాజకీయాల్లో కూడా బిజీ గా ఉంటూ వస్తున్నాడు.

Read Also : Shiv Nadar: రూ. 2042 కోట్లు విరాళంగా అందించిన శివ నాడార్.. అంటే రోజుకు రూ.5.6 కోట్ల విరాళం..!