Site icon HashtagU Telugu

Pawan Kalyan: డాక్టరేట్ అందుకుంటున్న చరణ్ కు పవన్ కల్యాణ్ విషెస్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఒక్కో సినిమాతో నటనలో నైపుణ్యాలను నేర్చుకుంటూ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం చెర్రీ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. బలమైన కథతో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. అంజలి, ఎస్‌.జె.సూర్య, జయరామ్‌, సునీల్‌, నాజర్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రంతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్నారు. చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుండి ఈ గౌరవ డాక్టరేట్ ను చెర్రీ తీసుకోనున్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే స్నాతకోత్సవంలో ఈ గౌరవాన్ని ప్రదానం చేయనుంది. కళా రంగానికి రామ్ చరణ్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదాన చేస్తున్నట్టు ఆ యూనివర్శిటీ చాన్సరల్ డాక్టర్ ఐసర్ కె.గణేష్ తెలిపారు.

We’re now on WhatsAppClick to Join

రామ్ చరణ్ డాక్టరేట్ పై బాబాయ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశాడు. రామ్ చరణ్ కు నా అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సాధించిన రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ దక్కడం సంతోషం కలిగించింది. రామ్ చరణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ ప్రశంసించారు.

Also Read: LSG vs DC: ఐపీఎల్‌లో నేడు మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరు.. ల‌క్నో వ‌ర్సెస్ ఢిల్లీ జ‌ట్ల మ‌ధ్య గ‌ణాంకాలు ఇవే..!