టాలీవుడ్ (Tollywood)లో మల్టీస్టారర్ మూవీస్ తో పాటు కొత్త కాంబినేషన్స్ పై ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటిస్తున్నారంటే ఆ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ ‘వినోదయ సీతమ్’ తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుండటంతో మెగా అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది.
ఈ సినిమా ఈరోజు సెట్స్ పైకి వెళ్లనుంది. పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకోవడం ఇదే మొదటిసారి. వారిద్దరూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి నటుడు-దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఆయన తమిళంలో నటించిన ‘వినోదయ సితం’ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీ స్టూడియో సౌత్ సెట్స్ నుండి రెండు చిత్రాలను షేర్ చేసింది. “అత్యంత ప్రతిష్టాత్మకమైన & పవర్ ఫుల్ కాంబినేషన్ #PSPK & #SDT ప్రాజెక్ట్ ఈరోజు ప్రారంభమవుతుంది. #PKSDT” ఫోటోలు చూడొచ్చు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తన కెరీర్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఈ మూవీ ఒకటి. షూటింగ్ ప్రారంభం కావడంతో ఎక్కడాలేని ఉత్సాహంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్‌లో కృతజ్ఞతలు తెలిపారు. “‘అత్యుత్తమ రోజు’ నేను ఎప్పటికీ ఆరాధిస్తాను. నా గురువు కళ్యాణ్ మామాతో కలిసి పనిచేయడం నా కల నిజమైంది’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. 2021 సెప్టెంబర్‌లో జరిగిన ఘోర బైక్ యాక్సిడెంట్ తర్వాత దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ రెండో సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
Also Read: Ram Charan: రామ్ చరణ్ దైవ భక్తి.. అయ్యప్ప మాలలోనే ఆస్కార్స్ కు!
